'అమ్మ చేతి వంట' తో 2 మిలియన్ వీక్షకులు..నేటి యువతకు ఆదర్శం...
అయితే వాటికి చెప్పుకోదగ్గ వ్యూస్ రాకపోవటంతో వీక్షకులను ఎలా పెంచుకోవాలి అని, వ్యూస్ ఎలా పెరుగుతాయి??టాగ్స్,టైటిల్,థంబ్ నెయిల్స్ ఎలా పెట్టుకోవాలి అని విషయాలతో గాలించి,తెలుసుకొని ప్రొఫిషనల్గా వీడియోలు పెట్టడం మొదలుపెట్టారు.మొదటి నెలలో 90కి పైగా వీడియోలు పెట్టింది. భార్గవి పెట్టిన వీడియోలలో దసరా నవరత్రులకి నైవేద్యం పెట్టె ప్రసాదం తయారి విడియోలకి ఉహించని స్పందన లబించింది.తర్వాత ఆనియన్ సమోసా,ఇన్స్టెంట్ టమోటా పచ్చడి,కేకులు,మంచురియా ఇలా ఒకటి ఏంటి తన చానల్ లో లేని వంటకం లేదు.అ తర్వాత తను వెనుతిరిగి చూడలేదు.
ప్రస్తుతం భార్గవి హైదరాబాదుకి తన కుటుంబంతో షిఫ్ట్ అయ్యారు."మనలో మన మాట" అనే ఇంకో చానెల్ను స్టార్ట్ చేసి అందులో తన డాక్టర్ భర్తతో కరోనాకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు,నుట్రిషిన్ ఫుడ్ గురించి ప్రజలకు ఉపయోగపడే వీడియోలు పెడుతున్నారు. వీక్షకులు పెరగటంతో యూ ట్యూబ్ సిల్వర్ బటన్,గోల్డ్ ప్లే బటన్లతో భార్గవిని సత్కరించింది." నా కుటుంబ సభ్యుల ప్రోత్సాహం వల్లే యూ ట్యూబ్ ఛానల్ ని నడపగలుగుతున్నాను.యూట్యూబ్లోవంటకాలు మనం చేస్తే సరిగ్గా రావు' అని జనాల్లో వున్నాఅభిప్రాయం పోయి వంటలు బాగా వస్తున్నాయి అని పోస్టులు చూస్తే పడిన కష్టం అంతా మరిచిపోతాను అంటున్నారు భార్గవి.కొత్తగా చానెల్ పెట్టిన వారు వ్యూస్ రావటం లేదని నిరాశ పడకూడదని,మంచి కాంటెంట్ ఉంటే వీక్షకులు పెరుగుతారని భార్గవి సలహా ఇస్తున్నారు.