ఇంగ్లీష్ ఇరగదీసిన చెత్త ఏరుకునే మహిళ

Mamatha Reddy
మనిషి యొక్క రూపాన్ని బట్టి వారి జీవన ప్రమాణాన్ని వారి స్థాయిని అభిప్రాయపడుతూ వస్తుంటారు ప్రజలు. ఇది చాలా తప్పుడు అభిప్రాయం. ఒక మనిషి రూపం ఆకారం ని బట్టి వారి స్థాయిని ఏమాత్రం గుర్తించవద్దు. మనిషిని మనిషిగా చూడాలి. వారి ప్రవర్తన ఆధారంగా, వేసుకునే దుస్తులు ఆధారంగా వారితో ఎలా వ్యవహరించాలో నిర్ణయించుకోవడం సరికాదు. ఇలాంటి ప్రవర్తన మనలోని అజ్ఞానాన్ని బయటపెడుతుంది తప్ప కొంత కూడా మనకు మేలు చేయదు. ఇలాంటి జీవిత సత్యాలకు సంబంధించిన వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలా ఎదుటివారిని తక్కువ గా చేసి చూడడం ఎంతటి తప్పో ఇప్పుడు చెప్పబోయే ఉదాహరణ ద్వారా అందరికీ తెలుస్తుంది.

సోషల్ మీడియాలో ఓ మహిళకు సంబంధించిన వీడియో ఇప్పుడు అందరి దృష్టిని ఆకట్టుకుంటోంది. ప్రతి ఒక్కరు ఈమె గురించి చర్చించుకుంటున్నారు. చెత్త ఏరుకుంటూ జీవనం సాగిస్తున్న ఈ మహిళా ఇంగ్లీష్ భాషలో అనర్గళంగా మాట్లాడుతూ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఆమె మాటలు వింటే ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోవడం ఖాయం. ఇంస్టాగ్రామ్ లో ఈమె వీడియో వైరల్ అవుతుంది ప్రస్తుతం. తాను ఏడు సంవత్సరాలు జపాన్ లో పని చేశానని తరువాత భారతదేశానికి తిరిగి వచ్చాను అని చెప్పింది. ఈ మహిళ. 

తన జీవిత కథను పాట పాడుతూ చెబుతుండేది. అయితే అందరూ ఆమెను పిచ్చిదాన్ని అభివర్ణించేవారు. తనపేరు మార్గరేట్ లారెన్స్ అని తెలిపింది. ఈ వీడియో ప్రకారం సదాశివనగర్ ప్రాంతంలో ఉంటూ చెత్త ఏరుకుంటూ జీవనం సాగిస్తుంది. ఈ వీడియో ని షేర్ చేసిన ఓ నెటిజన్స్ ఈమె గురించి చాలా బాగా రాశారు. వెంటనే ఇంస్టాగ్రామ్ లో itmeshachinaheggar అకౌంట్ కి వెళ్లి ఆ మహిళ వీడియో చూసేయండి మరి. ఈ వీడియో కాస్త వైరల్ కావడంతో నెటిజన్లు అందరూ ఆమె ఇంగ్లీష్ భాష కు ముగ్డలు అయిపోతున్నారు. తప్పకుండా తమ వంతు సాయం చేస్తామని పలువురు నెటిజన్ లు ఇప్పటికే ముందుకు వచ్చారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: