సేవ్ గాళ్ : ఊగే ఊగే ఉయ్యాల! నిన్నూ న‌న్నూ క‌ల‌పాల!

RATNA KISHORE

బిడ్డ‌లు వ‌ద్ద‌నుకునే త‌ల్లులు


ప్ర‌స‌వానికి ముందు


బిడ్డ‌లు పుట్టాక వ‌ద్ద‌నుకునే త‌ల్లులు


ప్ర‌స‌వం అనంత‌రం


మొద‌టిది భ్రూణ హ‌త్య రెండోది మాతృ హ‌త్య


అవును త‌ల్లులే విసిరేస్తారు కార‌ణం ఏమ‌యినా


వాటి గురించి విన్న‌వేవ‌యినా! వినిపించేవి అయినా!


సేవ్ గాళ్.. ఆడ బిడ్డ‌ల ర‌క్ష‌ణ‌కు సంగారెడ్డి జిల్లా


ముందుకు వ‌చ్చింది.త‌న వంతు బాధ్య‌త నిర్వ‌ర్తించింది



సంగారెడ్డి శిశు సంక్షేమ శాఖ అనాథ బిడ్డ‌ల‌ను ఆదుకుంటోంది. పాపం పుణ్యం తెలియ‌ని బిడ్డ‌ల‌కు అమ్మా నాన్నా తానే అవుతాను అని చెబుతోంది. మీకు భారం అనిపిస్తే అ లా చెత్త‌కుప్ప‌ల్లో వ‌దిలేయకండి..వారు ఊపిరి తీసుకోలేక చ‌నిపోతున్నారు..మాకు ఇవ్వండి మేం పెంచుతాం..అని చెబుతోంది. ఆడ బిడ్డ‌ల ర‌క్ష‌ణ‌కు ఈ శాఖ చేప‌ట్టిన చ‌ ర్య‌లే ఇప్పుడు తెలంగాణ‌కు ఆద‌ర్శం.త్వ‌ర‌లో ఇలాంటి ఊయ‌లు కొన్ని జిల్లా అంత‌టా ఏర్పాట‌వుతాయి. ఇప్పుడు శిశు గృహ‌కు పోదాం అక్క‌డ ఏర్పాటు చేసిన ఊయ‌ల‌లో బోసి న‌వ్వులు న‌వ్వుతున్న పాపాయిలు ఉంటారు.. వారిని ప‌ల‌క‌రించి వ‌ద్దాం..ఇప్ప‌టికే ఇద్ద‌రు చిన్నారుల‌కు బాల సారె చేసి వారికి నామ‌క‌ర‌ణోత్స‌వం చేశారు ఇక్క‌డి అధికారు లు.. ఆడబిడ్డ‌లు ప‌త‌కాలు తెస్తే ఆనందిస్తాం అదే ఆడ‌బిడ్డ మన క‌డుపున పుడితే చిదిమేస్తాం..లేదా విసిరేస్తాం..దేశం త‌ల‌వొంచుకునేలా ! ఇలాంటి ఘ‌ట‌న‌ల‌ను అడ్డుకునేం దుకు సంగారెడ్డి శిశు సంక్షేమ శాఖ చేప‌ట్టిన ఈ చ‌ర్య‌లు ముందున్న రోజుల్లో ఫ‌లితం ఇవ్వాల‌నే ఆశిద్దాం.




క‌ల్లాక‌పటం తెలియ‌ని బిడ్డ‌లు. లోకం పోక‌డ తెలియ‌ని బిడ్డ‌లు.. ర‌క్త‌పు  మ‌ర‌క‌ల‌తో అప్పుడే పుట్టిన బిడ్డ‌లు ఏ త‌ల్లో చెత్త కుప్ప‌ల్లో విసిరి పోతుంది. ఏ త‌ల్లో త‌న‌కెందుకు అని వ‌దిలించుకుని వెళ్తుంది. మురికి కాల్వ‌ల్లో బిడ్డ‌లు అప్ప‌టికే ఊపిరి ఆగిపోయి దీనా వ‌స్థ‌లో ఉంటారు. ఆడ‌బిడ్డ‌లకు, అనాథ బిడ్డ‌ల‌కు అండ‌గా నిలిచే వారే అరుదు.ఈ నేప‌థ్యం లో సేవ్ గాళ్ చైల్డ్ అనే నినాదంతో సంగారెడ్డి జిల్లా బాలికా సంర‌క్ష‌ణాధికారి త‌న‌వంతు బాధ్య‌త‌గా ఓ కొత్త కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం దిద్దారు. జిల్లా కేంద్రంలోని మ‌హిళా ప్రాంగణం ఆవ‌ర‌ణ‌లో ఉన్న శిశు గృహ వ‌ద్ద ఓ ఊయ‌ల ఏర్పాటుచేసి, అక్క‌డే ఓ బ్యాన‌ర్ ను కూడా క‌ట్టించారు. ఇక‌పై మీకు మీ బిడ్డ‌లు వ‌ద్ద‌నుకుంటే ఈ ఊయ‌ల‌లో ఉంచి మీరు వెళ్లి పోవ‌చ్చు. మేం వారి సంర‌క్ష‌ణకు చ‌ర్య‌లు తీసుకుంటాం. వారి ఆల‌నా పాల‌నా చూస్తాం. మీరు ఇక్క‌డ సీసీ కెమెరాలు ఉంటాయని అనుమానించ‌వ‌ద్దు. ఇక్క‌డ అలాంటి  ఏ ర్పాటు ఏది లేదు. మీరు నిర‌భ్యంత‌రంగా ఇక్క‌డ మీ ప‌సి కందుల‌ను వ‌దలి వెళ్ల‌వ‌చ్చు...అని పేర్కొంది.



ఇప్ప‌టికే బాలికా సంర‌క్ష‌ణ‌కు ఎన్ని చ‌ర్య‌లు ప్ర‌భుత్వాలు తీసుకుంటున్నా ఫ‌లితాలు మాత్రం రావ‌డం లేదు. కానీ ఈ ప్ర‌య‌త్నం మాత్రం ఎంతో వినూత్నంగానూ,ఆద‌ర్శ‌నీ యంగానూ ఉంది. బిడ్డ‌లు లేని త‌ల్లిదండ్రుల‌కు, ద‌త్త‌త తీసుకుందాం అని భావించే త‌ల్లిదండ్రులకు ఈ అనాథ బిడ్డ‌లను పెంప‌కం ఇచ్చేందుకు శిశు సంక్షేమ శాఖ తీసుకునే  చర్యలు కూడా స‌త్ఫ‌లితాలు అందుకునేందుకు ఆస్కార‌మే ఎక్కువ.




 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: