అమ్మ: ఓటీసీ ప్రెగ్నెన్సీ కిట్ ద్వారా కచ్చితమైన ఫలితం రావాలంటే ఏం చేయాలి..?

N.ANJI
ప్రెగ్నెన్సీ అవ్వాలనుకున్నా..ఒకవేళ వద్దూ అనుకున్నా వైద్యులదాక వెళ్లకుండా చిన్న టెస్త్ ద్వారా మీరే తెసులుకోవచ్చు. ఓవర్ ది కౌంటర్ ప్రెగ్నెస్సీ టెస్టు ద్వారా మీరు ప్రెగ్నెంట్ అయ్యారా లేదా అనే విషయాన్ని ఇట్టే తెలుకోవచ్చు. యూరియన్ సహాయంతో క్షణాల్లో రిజల్స్ వచ్చేస్తుంది. అయితే టెస్ట్ చిన్నదే అయినా చేసే పద్ధతి తెలియాలి.అప్పుడే కచ్చితమైన ఫలితాలు వస్తాయి.
కొన్నిసార్లు వెంటనే చేయటం వల్ల ప్రగ్నెంట్ అయినా కాదని చూపించే ప్రమాదం ఉంది.  కాబట్టి  తప్పుడు ఫలితాలకు లోనవకుండా టెస్ట్ సరిగ్గా ఎలా చేసుకోవాలో కూడా తెలుసుకుందాం.
OTC ప్రెగ్నెన్సీ కిట్ ద్వారా యూరిన్ ని టెస్ట్ చేయాలి. ఇది HGC ద్వారా తెలుస్తుంది. ఒకవేళ ఆ యువతి ప్రెగ్నెన్సీ అయితే అది యూరిన్ లో ఉంటుంది. కాబట్టి యూరిన్ లో HGC కనిపిస్తే ప్రెగ్నెన్సీ అయినట్లు. స్పెర్మ్ తో ఫర్టిలైజ్ అయిన ఎగ్ బయట ఉన్నా..లేదా యూట్రస్ లైనింగ్ ఉన్నా టెస్ట్ లో తెలిసిపోతుంది.  ఈ ప్రాసెస్ అంతా జరగటానికి ఆరు నుంచి ఏడు రోజులు పడుతోంది.
టెస్ట్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం..మొదటి ఈ కిట్ ఏ మెడికల్ షాపులో అయినా మనకు దొరుకుతుంది. ఒకటి తెచ్చుకోండి.
ఉదయం లేవగానే మొదట వచ్చే యూరిన్ తో టెస్ట్ చేస్తే కరెక్ట్ రిజల్ట్ వచ్చే అవకాశం ఎక్కువట. కాబట్టి తగిన మోతాదులో యూరిన్ ఒక శుభ్రమైన ప్లాస్టిక్ కప్ లో తీసుకోండి. ప్రెగ్నెన్సీ కిట్ లో ఈ యూరిన్ వేయటానికి ఒక ప్లేస్ ఉంటుంది. అందులో డ్రాప్స్ డ్రాప్స్ గా పోయాలి. అలా వేశాక 5-10 నిమిషాలు వేచి చూడండి. ఈ సమయంలో కిట్ ను ఎక్కువగా కదపకండి. ఒకవేళ మీరు ప్రెగ్నెంట్ అయితే ఆ కిట్ లో రెండు గీతలు కనిపిస్తాయి. అప్పుడు అది పాజిటివ్ టెస్టు అయినట్లు అమమాట. ఒకవేళ కాకపోతే ఒకగీతే కనిపిస్తుంది. అది నెగిటీవ్ రిజల్ట్ అని అర్థం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: