అమ్మ: గర్భధారణ సమయంలో ఏవి ఫుడ్ డైట్ లో తప్పక ఉంచాలి?

N.ANJI
గర్భధారణ సమయంలో మంచి ఆహారం తీసుకోవాలని అందురూ చెబుతారు. కానీ తినే ఆహారంలో ఏది ఎలా మెయింటేయిన్ చేయాలి. తగిన పరిమితి వరకూ అవి ఫుడ్ లో ఉంటే ఓకే.. ఏది మించకూడదు. గర్భిణీలు తీసుకోవాల్సిన పౌష్టికాహారం గురించి ఈరోజు ఇంకాస్త తెలుసుకుందాం.
పూర్వీకులు జొన్నలు, రాగులు మాత్రమే తినేవారు. కాబట్టి వాళ్లు ఏరోగాలు లేకుండా అన్నన్ని సంవతర్లాలు బతికేశారట.. ఈ విషయం  మనందరికి కొద్దోగొప్పో తెలిసే ఉంటది. అవునండి..! వాటిల్లో పౌషకవిలువలు పుష్కలంగా ఉంటాయి. అందుకే గర్భధారణ సమయంలో జొన్నలు, రాగులు, ఓట్స్, బ్రౌన్ రైస్ తీసుకోవటం మంచింది. అందువల్ల కార్పోహైడ్రేట్స్ శరీరానికి బాగా అందుతాయి. కాబట్టి వాటిని తీసుకునేలా కుటుంబసభ్యులు చూసుకోవాలి.
ప్రోటీన్స్ కూడా గర్భిణీలకు చాలా అవసరం. ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే ఫుడ్ ఏదంటే.. గుడ్లు, చికెన్, చేపలు, పాలు ఇంకా పన్నీర్, పప్పులు, గింజలు. నట్స్ లో కూడా ప్రోటీన్స్ బాగానే ఉంటాయి. వీటితో షేక్ టైప్ లో చేసుకుని తిన్నా మంచిదే. ఇవి కూడా గర్భీణీల డైట్ లో ఉండేలా చర్యలు తీసుకోవాలి.  తినే ఆహారంలో ఫైబర్ ఎక్కువగా ఉండాలి. ఫైబర్ మనకు ఆపిల్, జామ, పీచ్, బెర్రీల్ వంటి వాటిల్లో దొరుకుతుంది. ఫైబర్ ఎక్కువ తీసుకోవాటం ఆరోగ్యానికి చాలా మంచింది. కాబట్టి ఫ్రూట్స్ బాగా తినాలి.
 
 అంతేకాకుండా ప్రేష్ కూరగాయాలు అంటే తోటకూర, పాలకూర, క్యాబేజీ, కాలీఫ్లవర్, బ్రోకలీ లాంటివాటితో ఏదో ఒక వెరైటీ చేసీ గర్భిణీలకు పెడుతూఉండాలి. ఆకుకూరల్లో విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇంకా క్యాబేజీ, కాలీఫ్లవర్ , క్యారెట్ లాంటి వాటిల్లో గట్ బూస్టింగ్ గుణాలు కూడా మెండుగానే ఉన్నాయి. వీటిని తీసుకోవాటం ఆరోగ్యానికి చాలా మేలు చేకూరుస్తుంది.
ఇంక పెరట్లో ఉండే తులసి..తులసి ఆరోగ్యానికి చాలా మంచిది. పసుపు, అల్లం, వెల్లుల్లిని కూడా కూరల్లో బాగానే వేసుకోవాలి. ఇంకా జ్యూస్ ల విషయానికికొస్తే.. అన్ని ఫ్రూట్స్ జ్యూస్ తీసుకొవచ్చు.. ఒక్క బొప్పాయ తప్ప. నిమ్మకాయ నీళ్లు, ఆపిల్ సైడర్ వెనిగర్ కూడా తీసుకోవటం మంచిదే. అంతేకాదు.. వీటన్నిటితో పాటు పీచుపదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారం కూడా తీసుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: