అమ్మ: గర్భధారణ సమయంలో పన్నెండు వారాలలో వచ్చే సమస్యలు ఇవే..??

N.ANJI
మాతృత్వం అనేది స్త్రీకి దేవుడించిన వరం. అమ్మ అనే పిలుపు కోసం ఎంతో ఆరాటపడుతూ ఉంటారు మహిళలు. ఇక గర్భం దాల్చిన మొదటి రోజు నుండి బిడ్డకు జన్మనిచ్చే వరకు చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. అయితే గర్భధారణ సమయంలో 8 -12 వారాల మధ్య గర్భిణులు అనేక ఆరోగ్య సమస్యలకు గురవుతుంటారు. అయితే ప్రెగ్నెసీ సమయంలో గర్భిణులు ఉదయం వికారం వంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ఇక ఆ సమయంలో ఆహారం అంతగా తినాలని అనిపించదు.
అయితే అలాంటి సమయంలో గర్భిణులు కొంచెం పరిమాణంలో ఎక్కువ సార్లు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇక తాజా పండ్లు, కూరగాయలు, రైస్, రోటీలు, బేక్డ్ లేదా బాయిల్ చేసిన బంగాళాదుంపలు, గుడ్లు, చికెన్, తృణ ధాన్యాలు, సోయా నగ్గెట్స్, పాలు, పెరుగును ఆహారంలో భాగంగా చేసుకోవాలని అన్నారు. గర్భిణులు రోజుకు 12 గ్లాసుల నీరు తాగాలని సూచించారు. అలాగే కొబ్బరి నీరు, అరటిపండు జ్యూస్ తాగాలని చెప్పారు.ఇక ఉప్మా, కార్న్ తో చేసిన పదార్థాలు, ఇడ్లి, దోశను బ్రేక్ ఫాస్ట్ కింద తీసుకోవచ్చునని అన్నారు.
ఇక నేటి సమాజంలో విటమిన్ బి12 చాలా అవసరం ఉంటుంది. అయితే విటమిన్ బి12 లోపిస్తే అనీమియా, నాడీ వ్యవస్థ దెబ్బతినేందుకు కారణం అవుతుంది. అంతేకాదు.. పాలు, పాల ఉత్పత్తులు, మాంసాహారం తగినంత తీసుకునే వారికి ఇది అసరమైన మేర దొరుకుతుంది. ఇక శాఖాహారులైతే పాలతోపాటు సప్లిమెంట్లను కూడా తీసుకోవచ్చునన్నారు.
గర్భిణులకు మెగ్నీషియం కూడా చాలా అవసరం. అయితే లోపల శిశువు ఎముకలు మంచిగా వృద్ధి చెందేందుకు, కండరాల నిర్మాణానికి, గర్భసంచి ఆరోగ్యం కోసం మెగ్నీషియం సహాయపడుతుంది. ఇక సోయాబీన్స్, ముడి ధాన్యాలు, వాటర్ మెలాన్ లో, డ్రైఫ్రూట్స్, పాలకూర, మెంతికూర, సోరకాయ, కాకరకాయ, స్వీట్ కార్న్, పాలు, పాల ఉత్పత్తుల్లో ఇది తగినంత దొరుకుతుంది. ఖీరాదోస, అరటిపండ్లు, రుస్క్ ను స్నాక్ గా తీసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: