అమ్మ:గర్భిణులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..!

N.ANJI
గర్భధారణ సమయంలో మహిళలు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా గర్భిణులు మూడోనెల నుంచి ఎడమ వైపు తిరిగి పడుకోవాలని ఆరోగ్య నిపుణలు చెబుతున్నారు. అయితే ఎక్కువ సేపు వెల్లకిలా పడుకోకుండా చూసుకోవాలని అన్నారు. అంతేకాదు.. పగలు సాధ్యమైనంత ఎక్కువగా ద్రవాలు తీసుకోవాలి. అయితే రాత్రి పూట వాటిని పరిమితం చేయాలి లేకపోతే ఎక్కువసార్లు మూత్రవిసర్జన నిద్రలేమికి దారి తీస్తాయని తెలిపారు.

ఇక కారం తక్కువగా ఉండే పదార్థాలు తినాలని చెబుతున్నారు. అంతేకాదు.. ఛాతిలో మంట పుట్టించే మసాలా ఆహారాన్ని మానెయ్యటమే మంచిది. ఛాతిలో మంట నిద్రరానివ్వదు. పడుకునేటప్పుడు గర్భిణుల కోసం ప్రత్యేకంగా తయారుచేసిన దిండ్లు వాడుకోవాలి. అవి అందుబాటులో లేకపోతే మరో దిండును మోకాళ్ల మధ్య పెట్టుకొని పడుకోవచ్చునని అన్నారు. అయితే పగటిపూట వీలు చేసుకొని కాసేపు కునుకు తీయాలని తెలిపారు. అంతేకాక.. నిద్ర బాగా పట్టేందుకు మనసును ప్రశాంతంగా ఉంచే పద్ధతులు పాటించాలన్నారు. ఇక నిద్రలేమితో బాధపడుతుంటే తప్పకుండా డాక్టరుకు చూపించుకోవటం మరవరాదని అన్నారు.

అయితే ఆరోగ్యమైన శిశువు కొరకు అన్ని కలిసిన పౌస్టికాహారము అనగా ఎక్కువపాలు, పండ్లు, ఆకుకూరలు, పప్పు వగైరా తీసుకోవాలని చెబుతున్నారు. ఇక మొదటి ఆరునెలలు నెలకొకసారి, ఏడు, ఎనిమిది నెలల్లో నెలకు రెండు సార్లు, తొమ్మిదోనెలలో వారానికొకసారి వైద్యపరీక్షలు చేయించుకోవాలని అన్నారు. ఇక సొంతముగా మందులు వాడడము, ఎక్సరేలు తీయించుకోవడము వంటివి చేయాలన్నారు. ఇక గర్భిణులు ఎత్తు మడమల చెప్పులు వాడకండి, గర్భం ధరించిన స్త్రీలు నిత్యం సంతోషంగా ఉండాలని తెలిపారు.

అంతేకాదు.. మొదటి మూడునెలలు, చివరి నెలలో దూరప్రయాణాలు, కారు స్కూటరు నడపడము, చేయరాదని అన్నారు. గర్భిణులు రాత్రులు 8-10 గంటలు, పగలు 1 గంట నిద్ర లేదా విశ్రాంతి తీసుకోవాలని అన్నారు. ఇక నిద్రపోవునపుడు ఒక ప్రక్కకు వీలైతే ఎడమ వైపు తిరిగి పడుకోవాలని అన్నారు. అంతేకాదు.. స్త్రీలు గర్భము దాల్చిన మూడు మాసముల తరువాత, ప్రసవించిన మూడు మాసముల వరకు యోగ విద్యనభ్యసించ రాదని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: