చదివింది 8వ తరగతి.. కానీ మన దేశాన్ని ఐక్యరాజ్య సమితి లో తలెత్తుకునేలా చేస్తుంది

Mamatha Reddy
తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది కి చెందిన తాడి దీపిక 9వ తరగతి మాత్రమే చదువుకొని సముద్ర కాలుష్యం పై ప్రజల్లో అవగాహన తీసుకొస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తోంది. ప్రపంచ సాగర దినోత్సవం సందర్భంగా ఈనెల 8న ఐక్యరాజ్యసమితి ప్రత్యేక ఆన్లైన్ కార్యక్రమంలో మన దేశం తరఫున పాల్గొనే అవకాశాన్ని అందుకున్న ఈ మహిళ ఆశయం ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చు. సమస్త జీవులకు నీరే ప్రాణాధారం. అలాంటి నీటి కాలుష్యంతో వచ్చే అనర్థాలు అన్నీ ఇన్నీ కావు.
 సముద్ర జలాలు విష తుల్యలమై పెరిగి సంక్లిష్టంగా మార్చేశాయి.  ముఖ్యంగా మత్స్య సంపద కాలుష్య కోరల్లో పడి విలవిల్లాడిపోతోంది. వాతావరణ పరిస్థితుల పై ప్రతికూల ప్రభావాన్ని చూపుతోంది అని సంస్థ ప్రతినిధులు చెప్పిన మాటలు ఆమె ఎంతగానో ఆలోచింపజేశాయి. ఆ దిశగా అందరిలో చైతన్యం కలిగించాలని నిర్ణయించుకొని 9వ తరగతి వరకు చదువుకున్న ఈమె తన భర్త ప్రదీప్ తో కలిసి ఈ గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
 
అంతర్వేది సాగర సంగమ ప్రదేశమే కాకుండా ప్రసిద్ధ లక్ష్మీనరసింహ దివ్యక్షేత్రం కావడంతో నిత్యం భక్తులతో, పర్యాటకులతో కళకళలాడుతుంటుంది. ఫిషింగ్ హార్బర్ కూడా ఉంది. పెద్ద సంఖ్యలో మత్స్యకారులు చేపల వేటకు వస్తుంటారు. ఇక్కడ అసలు సమస్య ఉంది వీటన్నిటి వల్ల అందమైన మా ఊరి సాగరతీరం కలుషితమై పోయింది అని ఆమె హెప్తుంది. దీనికి ప్రధాన కారణం ప్లాస్టిక్ వ్యర్ధాలే.. ఇవి నదీజలాల ద్వారా సముద్రంలోకి పెద్దఎత్తున చేరడంతో నీళ్లు విషతుల్యం అవుతున్నాయి. దీన్ని చాలా రకాల కార్యక్రమాల ద్వారా అవగాహన తీసుకువచ్చి వ్యర్థాలను సముద్రంలోనికి పోనివ్వకుండా చేశాం. ప్రస్తుతం ఎక్కడ పెడతారు కనిపించడం లేదు తీరం ఆహ్లాదకరంగా మారుతోంది.. అన్నారు. ప్రకృతి కోసం ఇంతలా చేస్తున్న ఈమెకు మరిన్ని ప్రోత్సాహాలు, బహుమతులు పొందాల్సిన వారు.. అందులోనూ ఓ మహిళా కావడంతో ఈమెకు అన్ని చోట్లా ప్రశంసలు దక్కుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: