అందం కోసం యువతుల రక్తంతో స్నానం - ఎలిజబెత్ రాణి ఘోరాలు
ఆమె చేసిన పనుల గురించి వింటే ఒక స్త్రీ ఇలా ఎలా ఆలోచించగలరు అని ఆశ్చర్యం వేస్తుంది. 1560 లో పుట్టిన బతోరీ తన 15వ ఏట పెళ్లి చేసుకొని సెజ్తే అనే కోటలోకి ప్రవేశించింది. నా కోట లో పనిచేసే సేవకులను, ఆ ప్రాంతంలోని రైతులను తక్కువ తరగతి వారిని విపరీతమైన టార్చర్ కు గురిచేసేది. అందమైన యువతులను చంపించి వారి రక్తంతో స్నానం చేసేది. తన అందం ఎప్పటికీ అలాగే ఉంటుంది అన్న నమ్మకంతో అలా చేసేదట. ఆమె అందమైన అమ్మాయిలకు బ్రతికి ఉండగానే నరకాన్ని చూపించేదట. అందమైన అమ్మాయి కింది భాగానికి తేనె పోసి చీమలను, తేనెటీగలను వదిలేశేదట. పిన్నిసులతో గోర్ల కింద గుచ్చేదట.
భర్త చనిపోయాక మరింతగా రెచ్చిపోయి బతోరి తన సేవకులను ఇష్టం ఉన్నట్లు కొరికేదట. ఒకసారి ఓ సేవకురాలిని మాంసాన్ని కోసి వండించి ఆమె తోటే తినిపించిందట. ప్రేమ కారణంగా ఆరువందల యాభై మందికి పైగా చనిపోయారు అని ఆరోపణలున్నాయి. అయితే న్యాయస్థానం ముందు ఇవేవీ నిర్ధారణ కాలేదు. కారణం ఆమె అత్యున్నత కుటుంబానికి చెందినామె కావడం. దీనికి తోడు ఆమె బంధువులే రాజ్యం చేయడం.