తక్కువ ఖర్చులో పైప్ హౌస్ కట్టిన అమ్మాయి..ఎగబడుతున్న ఆర్డర్లు

Mamatha Reddy
భారతదేశం ఎంత అభివృద్ధి చెందుతున్న దేశమే అయినా ఒక అధ్యయనం ప్రకారం ఇండియాలో  63 మిలియన్లకు పైగా ప్రజలకు గృహ పై లేదు. దేశంలో చాలామంది ఇప్పటికీ గుడిసెలు, రేకుల షెడ్ లో జీవితం కొనసాగిస్తూ కాలం వెళ్లబుచ్చుతున్నారు. తక్కువ ఖర్చుతో ఇల్లు నిర్మించగలిగితే భారతదేశంలో చాలామంది పేదవారికి మేలు కలుగుతుంది. కానీ ఆ దిశగా ప్రయత్నాలు చేసే వారు చాలా తక్కువ మందే ఉంటారు. అలాంటి వారిలో తెలంగాణకు చెందిన మానసా రెడ్డి అతి తక్కువ ఖర్చుతో తక్కువ స్థలం లో ఇంటి నిర్మించవచ్చు అని రుజువు చేసింది.

తెలంగాణలోని ఓ గ్రామానికి చెందిన ఈమె ఇల్లు ను నిర్మించిన తీరును చూసిన చాలా మంది ఆమె ప్రతిభకు ముగ్దులయ్యారు. ఎంతో మంది ఇంజనీర్లు సైతం సంభ్రమాశ్చర్యాలకు గురి అయ్యి ఆమె ఆలోచనను అభినందించారు. దీంతో ఆమె దేశ వ్యాప్తంగా ఇటువంటి ఇళ్లను పేద ప్రజల కోసం నిర్మించి ఇవ్వాలని స్టార్టప్ ప్రారంభించింది. ఈమె తయారు చేసిన మోడల్ ఇంటి ని చూసిన వారు ఆమె స్టార్టప్ కంపెనీ ద్వారా ఇంటి ని అమర్చుకోవడానికి ఆర్డర్ లు ఇస్తున్నారు. కేవలం రెండు నెలల్లో ఆమెకు రెండు వందల ఇళ్ల నిర్మాణానికి ఆర్డర్లు వచ్చాయట. ఈ ఒక్కటి చాలు ఆమె నిర్మించిన ఇంటి గొప్పతనాన్ని వివరించడానికి..

తెలంగాణ లోని ఓ మాలుమూర గ్రామం లో పుట్టి పెరిగిన మానస తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ సొసైటీ పాఠశాల లో విద్యను పూర్తి చేసింది. హై స్కూల్ పట్టా పొందిన తర్వాత ఆమె పంజాబ్ లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ నుండి సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడే ఆమె తక్కువ ఖర్చుతో ఇంటిని నిర్మిస్తే అందరికీ ఉపయోగకరంగా ఉంటుందని అనిపించిందట. దాని కోసం నెలల తరబడి వివిధ రకాల దేశాల గృహ ఎంపికల పై పరిశోధన చేసి పాడ్ తరహా ఇంటిని తయారు చేయాలనే ఆలోచనకి ప్రేరణ పొందిందట. వినియోగదారుడు అవసరాన్ని బట్టి ఇంటి పరిమాణాన్ని, ఇంటి షేప్ ని మార్చుకోవచ్చట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: