ఆ బ్రాహ్మణ స్త్రీ చేసిన తప్పే దేశమంతటా రాజ్యాలు వెలిసేలా చేసాయి
అలా శర్మిష్టను కూడా తన చెలికత్తె గా తీసుకెళుతుంది దేవయాని.. శర్మిష్టను చూసిన యయాతి ఆమెను కూడా ఇష్టపడతాడు.. వారి మధ్య ప్రేమ సంబంధాన్ని దేవయాని ద్వారా తెలుసుకున్న శుక్రాచార్యుడు శర్మిష్ఠ తో సంబంధం కూడదని ఆదేశించాడు.. అయిన రహస్యంగా శర్మిష్టను వివాహం చేసుకొని కొడుకులను కంటాడు యయాతి.. ఈ విషయాన్ని తెలుసుకున్న శుక్రాచార్యుడు ఆగ్రహించి యయాతి ని నపుంసకుడు కావలసిందిగా శపిస్తాడు.. అయితే తన శాపాన్ని ఉపసంహరించుకోవల్సిందిగా ఎంతగానో ప్రాధేయపడగా శుక్రాచార్యుడు జరిగే ఓ పరిష్కారం చూపుతాడు..
నీ పుత్రులలో ఒకరు నీకు బదులుగా ముసలితనాన్ని అనుభవించడానికి అంగీకరిస్తే వారి యవ్వనాన్ని మీకు ధార పోయొచ్చునని సమాధానం ఇస్తాడు.. పురు అనే అతని చిన్న కొడుకు తండ్రి కోరికను అంగీకరించి తన యవ్వనాన్ని తండ్రికి ఇస్తాడు.. అలా వెయ్యేళ్ళ పాటు తన శారీరక వాంఛను తీర్చుకున్నాడు యయాతి.. చివరికి అతనికి తన వాంఛ పూరితమైన జీవితంపట్ల వెగటు పుట్టి భౌతిక ప్రపంచం అంటేనే విరక్తి కలిగింది.. తిరిగి తన యవ్వనాన్ని కుమారుడికి ప్రసాదించి అతనికి తన సామ్రాజ్యాన్ని కూడా ఇచ్చేసాడు.. యయాతికి దేవయాని ద్వారా ఇద్దరు, శర్మిష్ట ద్వారా ముగ్గురు పుత్ర సంతానం కలిగారు.. వారి ద్వారా ప్రపంచమంతా ఐదు రాజవంశాలు విస్తరించాయి.. యదువంశం, తుర్వసు వంశము, భోజ వంశం, గ్రీకులు, పౌర వంశము.. ఇలా ఈ యయాతి మహారాజు యొక్క వంశ చరిత్ర ప్రపంచమంతటా వ్యాపించింది..