టిఫిన్ ఒక దేశంలో, భోజనం ఒక దేశం లో చేసిన కోటీశ్వరురాలు ..కానీ నేడు..?
ఇలాంటి సంఘటనలు మనము సినిమా ఇండస్ట్రీలో చూస్తూ ఉంటాం.. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా, హీరోలుగా, ఆర్టిస్టుగా, దర్శకులుగా, నిర్మాతగా ఉన్నవారు తమ కెరీర్ అయిపోయిన తర్వాత అత్యంత దీన స్థితిలో జీవనం చేస్తున్నారనే వార్తలు ఇప్పటికి మనం చూస్తున్నాం.. ఎందువల్ల జరుగుతుందో తెలియదు కానీ అలా జరగడం వారి వీధి.. విచ్చలవిడిగా ఖర్చు చేయడం కావచ్చు, విలాసంగా ఉండడం కావచ్చు, మోస పోవడం కావచ్చు, ఏదో రకంగా వారు తమ చేతుల్లోని డబ్బును పోగొట్టుకొని, అత్యంత దీన స్థితిలో జీవితాన్ని గడుపుతూ పాపం అనిపించేలా జీవిస్తుంటారు..
అలా ఓ మహిళ ఎంతో విలాసవంతమైన జీవితాన్ని గడిపి ఇప్పుడు అత్యంత దీనస్థితిలో జీవనం చేస్తుండటం అందర్నీ కలచివేసింది.. అత్యున్నత స్థానంలో ఉన్న ఆమె ఇప్పుడు మోసగించి బడి అన్ని కోల్పోయి నిరుపేద జీవితం గడుపుతుంది.. సొంతంగా బ్యాంకింగ్ వ్యవస్థనే నడిపిన ఆమె ఇప్పుడు చేతిలో చిల్లిగవ్వ లేకుండా కూడా బ్రతుకుతుంది.. అయితే రాయల్ జీవితం లో లేని ఆనందం ఈ నిరుపేద జీవితం లో ఉందని ఆమె ఓ సందర్భంలో వెల్లడించింది.. అంత మోసం, అన్ని కోట్ల నష్టం వచ్చినా కూడా సాధారణమైన జీవితాన్ని గడుపుతూ ఉన్న ఈమె ఆత్మస్థైర్యానికి శతకోటి వందనాలు.. ఓ ప్రముఖ ఛానల్ చేసిన ఆమె ఇంటర్వ్యూ ఇప్పుడు వైరల్ గా మారింది..