తెగిన రాణి తలతో రాజు యుద్ధం ..ఆమె తెగువ అసామాన్యం

Mamatha Reddy
పూర్వకాలం రాజుల యుద్ధాలు చేసేప్పుడు రణరంగానికి వెళ్లేముందు వారి భార్యలు వారికి వీరతిలకం దిద్ది యుద్ధం చేయమని పంపించేవారు.. ఈ క్రమంలోనే రాజు తమ పెద్దల ఆశీర్వాదం కూడా తీసుకొని యుద్ధానికి వెళ్లేవారు.. అయితే ఆ మహా రాణి మాత్రం తన భర్తను యుద్ధానికి పంపించడం కోసం ఏకంగా తన ప్రాణాన్ని త్యాగం చేసింది.. అవును అవును భర్త తనని విడిచి ఉండలేకపోతున్నాడని భావించిన ఆమె అతన్ని ఎలాగైనా యుద్ధానికి పంపాలని భావించి తనను తాను ప్రాణత్యాగం చేసుకుంది.. ఆమె రాజ్ పుత్ వంశానికి చెందిన హదీ రాణి..
రాజస్థాన్ లో హదా చౌహన్ రాజపుత్ కుమార్తె హదీ రాణి.. ఆమె మేవడ్ సలుంబర్ రాజు చుండవత్ చిప్తేయిన్ ను వివాహం చేసుకుంది.. అయితే మహారాజ రానా సింగ్ చిప్తెయిన్ ను యుద్ధంలో పాల్గొనేందుకు పిలుస్తాడు.. ఔరంగజేబు తమ సామ్రాజ్యాన్ని ముట్టడించాలని యుద్ధం చేయడానికి ముందుకు రావాలని పిలవగా అప్పటికే పెళ్లై ఒక్కరోజే అయిన చిప్తేయి న్ భార్యను వదిలి వెళ్ళడానికి విముఖత వ్యక్తం చేశాడు..
అయితే రాణి మాత్రం యుద్ధానికి వెళ్లాల్సిందే అని చెప్తుంది దీంతో యుద్ధానికి బయలుదేరుతాడు.. ఆయన తన భార్యని ఒంటరిగా విడిచి పెట్టి వెళ్ళలేకపోయాడు.. ఆమె గుర్తుగా ఏదైనా తెమ్మని చెప్తాడు భటుడితో.. భటుడు వెళ్లి విషయాన్ని చెప్పగా ఆమె ఆశ్చర్యానికి లోనై తన భర్త యుద్ధానికి వెళ్లేందుకు తాను అడ్డుగా ఉన్నానని లేకపోతే యుద్ధం చేస్తాడు అని భావించిన ఆమె తన తలను నరికి భటుడు కి ఇచ్చి పంపిస్తుంది.. దీంతో తన భార్య త్యాగానికి చలించిపోయిన  చిప్తెయిన్ ఆమె తలను వెనుక కట్టుకుని యుద్ధ రంగంలోకి దిగుతాడు.. ఆ బాధలో, ఆవేశంలో ఔరంగజేబ్ సైన్యాన్ని తుత్తునియలు చేస్తాడు.. తన భార్య లేని జీవితం వ్యర్థం అని భావించి తన తలను కూడా నరుక్కొని ప్రాణత్యాగం చేస్తాడు చుండావత్..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: