అమ్మ: గర్భిణీలు ఈ ఐదు విషయాలకు దూరంగా ఉండాలి..!
ఇక గర్భంతో ఉన్నపుడు పెంపుడు జంతువులకు దూరంగా ఉండడం మంచిది. పిల్లి, కుక్క, పక్షులు లేదా ఇతర జంతువులు అనేక రకమైన వైరస్,బాక్టీరియా లను కలిగివుంటాయి, వీటికి దగ్గరగా ఉన్న సమయములో అవి మనకు వ్యాపించే ప్రమాదం వుంది. అందు వలన కడుపుతో ఉన్న వారు పెంపుడు జంతువులకు దూరంగా ఉండడం మంచిది. \ధూమపానం వలన నికోటిన్ ,కార్బన్ మోనాక్సైడ్ ,లెడ్ లాంటి ప్రమాదకరమైన పదార్ధాలు మీతో పాటు శిశువు కూడా చేరుతాయి. దీనివలన గర్భస్రావం, నెలలు ముందే కాన్పు జరగడం,శిశు మరణాలు లాంటి తీవ్రమైన పరిణామాలను ఎదురుకోవలసివస్తుంది. దూమపానాలకు దూరంగా ఉండండి.
గర్భిణులు దోమలు లేదా ఇతర ప్రమాదకరమైన పురుగుల నుంచి రక్షించుకోడానికి , ఇంట్లో జెట్ బిళ్ళలు లాంటి అనేక రకాల మందులు వాడడం సహజం.వీటివల్ల కలిగే మంచి ఎంతో చెడు కూడా అంతే వుంది. ఈ మందులు వాడే తీవ్రత పెరిగినప్పుడు వాటిలోని విష పదార్ధాలు శ్వాసలోకి చేరి నాడి వ్యవస్థ మీద ప్రభావం చూపించి తల్లికి బిడ్డకు ప్రమాదంగా మారే అవకాశం వుంది.
ఇక వ్యాయామం ఆరోగ్యానికి మంచిదైనా కడుపుతో ఉన్నపుడు శరీరానికి అధిక శ్రమను కల్గినవి చేయకపోవడం మంచిది. డాక్టర్ల సలహా మేరకు ఎటువంటి వ్యాయామాలు చేస్తే మంచిదో అవి మాత్రమే చేయండి. బరువులు ఎత్తడం, మోయడం లాంటి విషయాలకు ఎంత దూరంగా వుంటే అంత మంచిది.బరువులు ఎత్తడం వలన ఆ భారం గర్భంలోని శిశువు మీద పాడే అవకాశం వుంది చిన్నపాటి బరువు కల సరకుల సంచి అయినా సరే మీరు మోయకుండా వుండే వీలు చూసుకోవడం మంచిది అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.