ఒక సమస్య రావడం.. దానిపై పోరాడడం ఈ సమాజంలో కొందరు చేసే పనే.. ! అయితే.. కొన్నాళ్లకు సదరు సమస్యకు పరిష్కారం లభిస్తే.. ఓకే లేకపోతే.. అక్కడితే... అస్త్రసన్యాసం చేసి.. చేతులు ముడుచుకుంటా రు. కానీ, ఒకరిద్దరు మాత్రమే పట్టువదలని విక్రమార్కుల మాదిరిగా సదరు సమస్య పరిష్కారం కోసం.. ఎంత వరకైనా పపోరాటం చేస్తారు. ఇలాంటి వారిలో తెలుగు వనిత, డాక్టర్, సరిపల్లి
శ్రీజారెడ్డి కీలక స్థానంలో ఉన్నారు. ఆటిజం అనే అత్యంత ప్రమాదకరమైన చిన్నారుల వ్యాధిపై ఆమె చేసిన కృషి నిరుపమానం.
తన కుమారుడుకి పుట్టుకతోనే హియరింగ్ సమస్య వచ్చింది. దీంతో ఆమె ఎంతో మంది వైద్యులను సంప్రదించారు. కానీ, దీనికి అప్పట్లో ఎక్కడా ఒకే వేదికగా వైద్యం చేసే వారు కానీ, వైద్య రీతులుగానీ అందుబాటులో లేవు. దీంతో తన కుమారుడి సమస్య పరిష్కారం కోసం తన భర్త సరిపల్లి కోటిరెడ్డితో కలిసి ఎంతో అన్వేషణ చేశారు. దీనిపై ఎంతో రీసెర్చ్ చేయడంతో పాటు దేశంలో పలు ప్రాంతాలు తిరిగి.. ఆటిజానికి వైద్యాన్ని సాధించారు.ఈ పోరులో ఎక్కడా నిరాశ చెందలేదు. నేను ఇక, చేయలేను! అని కూడా అనుకోలేదు.
నిరంతర శోధన, నిర్విరామ కృషితో తన కుమారుడిని మామూలు మనిషిని చేసుకోవడం కోసం ఎంతో శ్రమించారు. ఈ క్రమంలో తను సాధించిన విజయాన్ని అందరికీ పంచాలని.. ఆటిజంతో బాధపడే చిన్నారుల తల్లుల మోముల్లో చిరునవ్వు చూడాలని తపించారు. ఈ క్రమంలోనే తాను సాధించిన ఫలితాన్ని అందరికీ పంచాలనే ధ్యేయంతో హైదరాబాద్ కేంద్రంగా పినాకిల్‌బ్లూమ్స్ అనే సంస్థను ఏర్పాటు చేసి.. ఆటిజం వైద్యాన్ని చిన్నారులకు చేరువ చేశారు.
ఈ క్రమంలో స్పీచ్ థెరపీ సహా అన్ని అధునాతన వైద్యాలను ఈ కేంద్రంలో ఏర్పాటు చేయడమే కాకుండా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వారికి ఉచితంగా .. అతితక్కువ ఖర్చుకే ఈ వైద్యాన్ని చేరువ చేసి.. ఎందరో చిన్నారులకు తల్లికాని తల్లి అయ్యారు. ఒక్క హైదరాబాద్‌లోనే పినాకిల్ బ్లూమ్స్ బ్రాంచ్‌లు 12 ఉన్నాయి. ఏపీలోనూ విజయవాడ, గుంటూరు, వైజాగ్, కర్నూలులో ఈ బ్రాంచ్‌లు సేవలు అందిస్తున్నాయి. ఆమె ఓ సైన్యంగా సాధించిన విజయాన్ని అందరికీ చేరువ చేసి.. తన కుమారుడి మాదిరిగా అందరూ కోలుకోవాలని అభిలషిస్తున్నారు.