భర్తను జైలుకు పంపిన ఓ భార్య కథ..ఎందుకంటే..!!

Mamatha Reddy
ఈ మధ్యకాలంలో ఆడవారు ఎంత బలంగా ఉంటున్నారో అంతే తెలివికల వారిగా ప్రవర్తిస్తున్నారు. తప్పు చేస్తే కన్నతండ్రి అయిన, కట్టుకున్న వాడైనా వదిలిపెట్టడం లేదు.. అలా సొంత భర్తనే జైలుకు పంపించిన ఓ భార్య కథ ఆమె మాటల్లోనే తెలుసుకుందాం.. ఒకడిని నా భర్తగా నిర్ణయం చేశారు..ఆడపిల్లకు పెళ్ళిపై ఎన్ని ఆశలు ఉంటాయో నాకు కూడా అలాగే ఉన్నాయి కానీ మొదటి రాత్రి పడక గదిలోకి తాగి వచ్చాడు నా భర్త..

జీవితాంతం గుర్తుండిపోయే శోభనాన్ని మానభంగం గా మార్చేశాడు ఆ క్రూరుడు.. పదహారేళ్ళ వయసులో నొప్పితో అల్లాడి పోయిన నేను మత్తులో నాపై ఆమృగం ఊగిపోతూ ఉండడం ఎంతో బాధగా అనిపించింది.. సరిగ్గా నెల తర్వాత తన స్నేహితులతో రాత్రి ఇంటికి వచ్చాడు..  నా ఫ్రెండ్ నాకు డబ్బులు ఇచ్చాడు ఇదిగో ఈ రాత్రి ఇతనితో గడుపు అన్నాడు.. కోపంతో ఎదురించబోయాను.. ఒప్పుకోలేదు.. కానీ నన్ను కొట్టారు.. వచ్చిన వాడు కోరిక తీర్చుకున్నాడు.. మా ఆయన అలా వచ్చిన డబ్బును తన జేబులో నింపుకున్నాడు..

ఏడాదిన్నర తర్వాత నాకు నాలుగు నెలలు నిండాయి.. డెలివరీ కావలసి ఉంది..  దేవుడికి దండం పెట్టుకున్నాను ఆడపిల్ల వద్దని మగపిల్లాడే కావాలని ఆ దేవుడిని వేడుకుంటున్నాను.. ఆయన దేవుడు నా మొర ఆలకించలేదు.. పుట్టింది ఆడపిల్ల.. నా కూతురికి 12 ఏళ్ళ వయస్సులో ఈసారి ఇంకో స్నేహితుడుని తీసుకొచ్చి నా కూతురు గదిలోకి పంపే ప్రయత్నం చేస్తున్నాడు నా భర్త.. నాకు జరిగిన ఈ అన్యాయాన్ని నా కూతురికి కూడా జరగనివ్వలేదు.. కోపంతో వాళ్లను బెదిరించాను.. తర్వాత పోలీస్ స్టేషన్ కు వెళ్ళి వారిపై కేసు పెట్టాను.. నా భర్త జైలుకు వెళ్ళాడు.. ఇప్పుడు మా ఏరియా లో నేను ఒక పెద్ద పపిష్టిదాన్ని అయిపోయాను..  భర్తను జైలుకు పంపిన భార్యగా నిలిచిపోయాను..  కానీ నాకు మాత్రమే తెలుసు నేను చేసిన పని తప్పుకాదని...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: