అమ్మ: గర్భిణులు ఇలాంటి పనులు చేస్తే డెలివరీ తర్వాత సమస్యలు రావు..!

N.ANJI
గర్భధారణ సమయంలో మహిళలు చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. గర్భధారణ సమయంలో ఎప్పుడు నిటారుగా ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే భంగిమ అనేది ఆరోగ్యానికి ఎంతో ముఖ్యమైనది . మంచి భంగిమ మీ లోపల ఉన్న బిడ్డను సౌకర్యవంతంగా ఉండేలా చేయగలదు. మంచి భంగిమ మీకు  నడుము నొప్పి  మరియు వెన్నునొప్పి రాకుండా చేస్తుంది. అంతే కాకుండా కటి కండరాలు ను బలం గా ఉండేలా చేస్తుంది.
గర్భిణులు పాలు,పెరుగు, గుడ్లు, చికెన్ జున్ను, పన్నీర్, ఆహారంలో ఎక్కువగా తినండి. వీటిలో ప్రోటీన్లు మోతాదు ఎక్కువగా ఉండడం వలన మీకు చిరు తిండ్లు తినాలనే వాంఛ తగ్గించి కడుపు నిండిన భావాన్నికలిగిస్తుంది. ప్రోటీన్లు మీకు, మీలో పెరుగుతున్న బిడ్డకి ఎంతో కీలకమైనవి. యోగ ధ్యానం ప్రతిరోజు  క్రమం తప్పకుండా చేయడం వలన మీకు ప్రశాంతత లభిస్తుంది. అంతే కాకుండా జీవితం లో మీకు ఏ సమస్య వచ్చినా దానిని ఎదుర్కొనే ధైర్యాన్ని ఇస్తుంది. ధ్యానం మీకు మీ జీవితం పైన ఒక నియంత్రణ తీసుకురావడానికి ఉపయోగపడుతుంది.
ఇక ప్రెగ్నెంట్ కదా అని ఎప్పుడు విశ్రాంతిలోనే  ఉండకూడదు. అప్పుడప్పుడు వ్యాయామం కూడా చేస్తుండాలి. ముందుగా స్ట్రెట్చ్స్   తో మొదలు పెట్టి తరువాత మెల్ల మెల్లగా కొంచెం క్లిష్టమైన వ్యాయామాలు చేస్తుండండి. ఈ సమయంలో నిపుణుల సహాయం పొంది జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. యోగ ధ్యానం ప్రతిరోజు క్రమం తప్పకుండా చేయడం వలన మీకు ప్రశాంతత  లభిస్తుంది. అంతే కాకుండా జీవితం లో మీకు ఏ సమస్య వచ్చినా దానిని ఎదుర్కొనే ధైర్యాన్ని ఇస్తుంది.
అంతేకాదు.. ధ్యానం మీకు మీ జీవితం పైన ఒక నియంత్రణ  తీసుకురావడానికి ఉపయోగపడుతుంది.ఒక్క విషయం బాగా గుర్తు పెట్టుకోవాలి.మీరు ఏ కారణం చేతనయినా ఆందోళన చెందుతూ ప్రశాంతతని కోల్పోవడం,ఏడవడం వంటివి చేస్తే ఆ ప్రభావం మీ బిడ్డ మీద కచ్చితంగా ఉంటుంది. బిడ్డ  పుట్టిన తర్వాత ఆ ప్రభావం కనపడి తీరుతుంది. కాబట్టి ఈ విషయంలో ముందునుండి జాగ్రత్తగా  ఉండటం మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: