ఇండియాలో నేర్చుకున్న అల్లం టీ అమెరికా లో పెట్టి కోట్లు సంపాదించినా మహిళా

Mamatha Reddy
అమెరికాకు చెందిన బ్రుక్ ఎడ్డీ అనే మహిళా స్వాధ్యాయ పరివార్ అనే కార్యక్రమం కోసం ఒకసారి మహారాష్ట్రకు వచ్చారు. అయితే ఆమె మహారాష్ట్రకు వచ్చినపుడు అక్కడి అల్లం టీ ని ఆవిడ రుచి చూశారట. ఆ టీ ఆమెకు తెగ నచ్చేసింది. అల్లం టీ తో పాటు మాసాల టీ ని కూడా ఆమె రుచి చూసారు అది కూడా ఆమెకు బాగా నచ్చింది. తను వచ్చిన కార్యక్రమాన్ని ముగించుకొని తిరిగి అమెరికా కు వెళ్ళింది. అయితే అక్కడి రెస్టారెంట్ లో టీ తాగింది. కానీ ఏది కూడా ఇండియాలో తాగిన టీ అంత అనుభూతిని ఆమెకు ఇవ్వలేకపోయింది. దీంతో ఆమె వెంటనే అల్లం టీని బిజినెస్ గా మొదలుపెట్టింది. తానే స్వయంగా అల్లం టీ, మసాలా టీ చేసుకొని అమ్మడం ప్రారంభించింది. ఆలా ఆమె మొదలుపెట్టిన కొన్ని రోజుల్లోనే అల్లం టీ కి అక్కడి ప్రజలు ఫ్యాన్ అయిపోయారు. ఆమె టీ బిజినెస్ కూడా విజయవంతం అయ్యింది.
ఆ తర్వాత ఆమె బయట అమ్మడం ఆపేసి భక్తి ఛాయ్ అనే పేరుతో ఒక షాప్ ని పెట్టింది. ఆలా ఆమె షాప్ కూడా విజయవంతం అయ్యింది. ఆ అల్లం టీ ద్వారా ఆమె అక్షరాల 220 కోట్లకు పైగా సంపాదించింది. ఇది నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయం. ఇండియా లో రుచి చుసిన అల్లం టీ అమెరికా లో బిజినెస్ పెట్టి ఆమ్మడం మూలంగా ఆమెకు  అంత ఆదాయం వచ్చిందంటే నిజంగా అది ఇండియా గొప్పదనము అవుతుంది. అయితే ఆ మహిళా తన బిజినెస్ ఇంత పాపులర్ అవడానికి గల కారకులైన ఇండియాని మాత్రం ఆమె మర్చిపోలేదు. బ్రుక్ ఎడ్డీ సామజిక సేవకురాలు కావడం వల్ల వచ్చిన ఆదాయం లో కొంత భాగాన్ని ఇండియాలోని పేదల కోసం ఖర్చు పెట్టడం విశేషం. ఈ విధంగా ఇండియా పై  ఆమె కృతజ్ఞత భావాన్ని చూపింది. ఆలా  ఇండియా లో అల్లం ఆంటీ ని చేయడం నేర్చుకొని అమెరికా లో బిజినెస్ గా ప్రారంభించి విజయవంతమైన బ్రుక్ ఎడ్డీ అనే మహిళా కథ ఇది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: