అమ్మ: గర్భధారణలో జర్వం వస్తే.. శిశువుకు ఫ్లూ వస్తుందా..?

N.ANJI

గర్భధారణ సమయంలో గర్భిణులు ఎంతో ఆందోళనకు లోనవుతుంటారు. ఇందులో ఆటిజం అనేది ఎక్కువ మందిపై ప్రభావితం చూపుతుంది. 2 నుంచి 3 ఏళ్ల వయసు ఉన్న పిల్లలు తరచూ ఈ లోపంతో బాధపడుతుంటారు. ఆటిజం వల్ల పిల్లలు బలహీనంగా, మానసిక ఆందోళనకు గురవుతుంటారు. అందరితో కలివిడిగా మాట్లాడలేకపోతుంటారు. ఇలాంటి సమస్యలు తలెత్తినప్పుడు గర్భధారణ సమయంలో తల్లలు అనారోగ్యానికి గురవడం వల్ల పిల్లల శ్రేయస్సుకు ఏమైనా సంబంధం ఉంటుందా అనే దానిపై అందరిలో సందిగ్ధత నెలకొని ఉంది.


ఆటిజం అనే జన్యపరంగా సక్రమించే ఉత్పరివర్తనం. పిల్లల్లో మానసిన అసమతుల్యత, ఆక్సిజన్ సరిగ్గా అందకపోవడం, మానసిక వికాసం, తరచూ అనారోగ్యానికి గురికావడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతుంటారు. ఇప్పటి వరకు చాలా మంది తల్లలకు ఆటిజం గురించి తెలియదు. ఈ మేరకు నార్వే మాలిక్యులర్ సైకాలజీ జర్నల్‌లో ఇటీవల పరిశోధనలు దీనిపై పరిశోధన నిర్వహించారు. దీని ప్రకారం.. గర్భధారణ సమయంలో గర్భిణులకు జ్వరం వస్తే.. పిండంలో ఉన్న శిశువుకి ఆటిజం వచ్చే ప్రమాదం 40 శాతం ఉంటుందని తెలిపారు. 1999-2009లో జన్మించిన 95,754 మంది పిల్లల్లో 583 మంది ఆటిజం బారిన పడ్డారని వారు నివేదిక సమర్పించారు.


వీరిలో 15,701 మంది గర్భిణులు 1 నుంచి 4 వారాలపాటు జ్వరంలో బాధపడినట్లు తేలింది. దీంతో గర్భంలో ఉన్న శిశువుకి కూడా ఆటిజం వచ్చిందన్నారు. 1-4 వారాలు జ్వరం వచ్చిన వారి పిల్లల్లో 34 శాతం ఆటిజం వచ్చే లక్షణాలు ఉన్నాయన్నారు. 2-3 వారాలపాటు జ్వరంతో బాధపడిన గర్భిణుల పిల్లల్లో 40 శాతం ఆటిజం వచ్చే ప్రమాదం ఉందన్నారు. అలాగే 12 వారాలపాటు జ్వరంతో బాధపడిన గర్భిణిల పిల్లలకు 300 శాతం ఆటిజం వచ్చే ప్రమాదం ఉందని పరిశోధకులు తెలిపారు. అలాంటప్పుడు గర్భిణులు ప్రతి 2-3 నెలల్లో అసిటమినోఫెన్ ఔషధాన్ని తీసుకోవాలని, అలా చేస్తే ఆటిజం ప్రమాదాన్ని తగ్గించవచ్చన్నారు. మూర్చవ్యాధితో బాధపడే తల్లలకు తమకు పుట్టబోయే బిడ్డలో ఆటిజం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని న్యూయార్క్‌లోని కొలంబియా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ మాడ్డీ హార్నిక్ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: