అత్యాచార యత్నం చేయబోయే వ్యక్తికి ఈ మహిళా వేసిన శిక్ష ఏంటో తెలిస్తే షాక్ అవుతారు.
కోర్టులు ఈ ఘటనలు చేసిన వారికీ శిక్షలు వేస్తుంటే ఇంకొందరు మహిళలు తన పై యత్నం చేసిన వారిని శిక్షిస్తున్నారు. అచ్చం ఇటువంటి ఘటనే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో సంభవించింది. ఈ ఘటనలో మహిళే అతడికి అదిరిపోయే శిక్షని వేసింది. మహిళా విధంగా చేసిన పనికి పోలీసులు కూడా ఆశ్చర్య పోవడం విశేషం. అసలేం జరిగింది ఇప్పుడు తెలుసుసుకుందాం.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సిధి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఆ జిల్లాలోని ఓ ఇంట్లోకి అపరిచిత వ్యక్తి ప్రవేశించి ఆ ఇంట్లోని మహిళాపై అత్యాచార యత్నానికి ఒడిగట్టాడు. దీంతో ప్రతిఘటించిన మహిళా తనని తాను కాపాడుకోవడం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తుంది.
అతని నుంచి తప్పించుకోడానికి వీలు లేకుండా పోయింది. దీంతో ఒక ఉపాయాన్ని పన్నింది. అదేంటంటే తనపై ఇంతటి ఘాతుకానికి ఒడిగట్టిన వ్యక్తి ప్రైవేట్ పార్ట్శ్ ని కోసేసి ఇక జీవితంలో ఇలాంటి పనులు చేయకుండా ఆ మహిళా అతడిని శిక్షించింది.
అనంతరం పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఈ విషయాన్నీ అధికారులకు వెల్లడించింది. వాళ్ళు కూడా ఇది విని షాక్ కి గురైయ్యారు. ఈ ఘటన జరిగేటపుడు తన భర్త ఇంట్లో లేకపోవడంతో ఆ వ్యక్తికి ఇంట్లోకి ప్రవేశించడానికి సులభం అవగా , అప్పుడు ఆ ఇంట్లో మహిళాతో పాటు ఆమె కుమారుడు ఉన్నారు. ఇంట్లోకి ప్రవేశించిన అతడు ఈ ఘాతుకానికి పాల్పడగా, సహాయం కోసం అతని కుమారుడు బయటికి వచ్చాడు. ఇంతలో ఆ మహిళా తనని రక్షించుకోవడం కోసమే అతడి ప్రైవేట్ పార్ట్శ్ కోసేయడం అత్యాచార బారి నుండి తప్పించుకోవడం అంత నిమిషం వ్యవధిలో జరిగిపోయాయి. అనంతరం ఆమె ఇచ్చిన పిర్యాదు మేరకు పోలీసులు అతడిపై పలు కేసులు నమోదు చేసారు.
భారతదేశం లో రోజులు కొన్నే వేల సంఖ్యలో అత్యాచార సంఘటనలు జరిగినంతగా వారికీ శిక్షలు కూడా అంతే వేగంగా వేస్తున్నారా అంటే లేదు అనే సమాధానం వస్తుంది. కాబట్టి కోర్ట్ వారికీ తొందరగా శిక్షలు పడేలా చూడాలి. లేదంటే ఈ మహిళా చేసిన మాదిరే జరుగుతుంటాయి.