అమ్మ: గర్భిణులు వీటిని ఎక్కువగా తీసుకుంటున్నారా..!?
కొంతమంది మహిళలు చర్మ సౌందర్యం కోసం ‘విటమిన్ ఇ’ సప్లిమెంట్లు తీసుకుంటారు. అయితే ప్రతి రోజూ క్రమం తప్పకుండా విటమిన ఇ తీసుకునే వాళ్లకి ‘ఆల్కాజ్ మొటాలిటీ’...అంటే ఏ ఆరోగ్య సమస్యతోనైనా ప్రాణాలు కోల్పోయే అవకాశాలు పెరుగుతాయి. ఇందుకు కారణం విటమిన్ ఇ సప్లిమెంట్లను వాడటం వల్ల శరీరంలో టాక్సిసిటీ పెరుగుతుంది.
అయితే శరీరానికి కావల్సిన క్యాల్షియం ఆహారం ద్వారా తీసుకోగలిగితే అదనంగా సప్లిమెంట్ల అవసరం ఉండదు. కాల్షియం, విటమిన్‌డి ఎక్కువగా తీసుకుంటే ‘హైపోకాల్సీమియా’ సమస్య ఉత్పన్నం అవుతుంది. అంటే శరీరంలో కాల్షియం నిల్వలు పేరుకుపోయి మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడవచ్చు. ఇతర అనారోగ్య సమస్యలు రావచ్చు.
బీ కాంప్లెక్స్, బి1, బి2, బి6, బి12 అనే ఎన్నో రకాలు ఉంటాయి. వీటన్నింటినీ మల్టీవిటమిన్ గా చాలావరకు తీసుకుంటారు. అయితే ఆహారంగా తేలికగా లభించే బి కాంప్లెక్స్ ఎక్కువగా తీసుకోవాలి. అయితే గర్భిణులు బీ కాంప్లెక్స్ సప్లిమెంట్స్ ఎంత మేరకు వాడాలి అన్నది డాక్టర్ సూచన ప్రకారమే వేసుకోవాలి. విటమిన్లు ఆరోగ్యానికి మంచివే అయితే పరిమితి మించితే పాపాయి ఆరోగ్యానికి ముప్పు తేస్తాయి. డాక్టర్ సలహా లేనిదే ఏ మాత్రలు వాడవద్దు.
పొగతాగే అలవాటు, మద్యం సేవించే అలవాటు ఉండే వారికి పుట్టబోయే పిల్లల ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయి. ఆరోగ్యవంతమైన పిల్లలు కావాలనుకునే మహిళలు దురలవాట్లకు దూరంగా ఉండాలి. నెల తప్పగానే చాలామంది మహిళలు బెడ్ రెస్ట్ అంటూ పూర్తిగా రెస్ట్ తీసుకుంటారు. ఇది సరి కాదు. కాబోయే అమ్మల శారీరక వ్యాయామం, మానసిక ఆనందం కడుపులోని బిడ్డను ఆరోగ్యంగా ఉంచుతుంది. తేలికపాటి పనులు చేయడం, మంచి పుస్తకాలు చదవడం, సంగీతం వినడం, పాజిటివ్ గా ఆలోచించడం వల్ల పాపాయి ఆరోగ్యంగా పెరుగుతుంది.