సక్సెస్ స్టోరీ : కష్టాలను ఎదురీదిన ధీర..యూట్యూబ్ సెన్సేషన్ గంగవ్వ..!
అతి చిన్న వయసులో నలుగురు పిల్లలను కానీ, ఉన్నదంతా ఊడ్చి ముగ్గురు కూతుళ్ళ పెళ్లి చేసింది, కొడుకును ప్రయోజకుడిని చేయాలనీ ఆశగా ఎదురు చూస్తుంది. గంగవ్వ సరదా గా మొదలు పెట్టిన యూట్యూబ్ ప్రయాణం ఇప్పుడు సినిమాల వరకు వెళ్ళే లా చేసింది. కృషి ఉంటె మనుషులు ఋషులు అవుతారు అని చెప్పడానికి గంగవ్వ జీవితం ఒక నిదర్శనం. జగిత్యాల జిల్లాలోని లంబాడిపల్లి గంగవ్వ పుట్టి పెరిగి పెళ్లి చేసుకున్న వూరు 5 ఏళ్ల వయసు లో గంగవ్వకు వివాహం జరిగింది. ఆమె చదివింది కేవలం ఒకటో తరగతి మాత్రమే . కానీ ఆమె చెప్పే మాటలు వింటుటే ఆమె కష్టాల కథల లో పీహెచ్డీ చేసిందనే చెప్పుకోవాలి. మొదటి సారి 2016 లో యూట్యూబ్ లో అడుగుపెట్టి కేవలం నాలుగేళ్ల లో సెన్సేషనల్ వీడియోస్ లో నటించింది. ఇప్పటికి మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగింది. ఆత్మస్థైర్యం తో మరింత ముందుకు వెళ్తోంది.