సక్సెస్ స్టోరీ : కష్టాలను ఎదురీదిన ధీర..యూట్యూబ్‌ సెన్సేషన్ గంగవ్వ..!

Mamatha Reddy
పెళ్లి అనే మాట తెలియని అమాయకపు వయసు..బ్రతకడం కోసం గల్ఫ్ కి వెళ్ళిపోయిన భర్త...భుజాలపై కుటుంబ భారం.. కూలి పని చేస్తే తప్ప పిల్లల కడుపు నింపలేని పరిస్థితి.. అన్ని కష్టాల నడుమ  గంగవ్వ భర్త కన్నుమూత..ఇలా ఎన్ని కష్టాలు వచ్చిన కుంగిపోక ఎదురీత.. ఎంత గడ్డు కాలం వచ్చిన అలుపెరగక పరిగెడుతూనే ఉంది గంగవ్వ.. ఇప్పుడు ఆమె వయసు 60 ఏళ్ళు. ఒకప్పుడు వూళ్ళో వాళ్ళు తప్ప మరెవరు ఆమె గురించి మాట్లాడుకోలేదు. కానీ నేడు ఆమె రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం. యూట్యూబ్ సెన్సేషన్ కి మారు పేరు ..బిగ్ బాస్ గంగవ్వ ప్రస్థానం. గంగవ్వ గురించి ఆమె జీవితం ప్రయాణం గురించి అందరికి తెలిసిందే. ..కొత్తగా ఏది సాధించలేని వయసులో ఆమె తన మాటల చాకచక్యంతో సెన్సేషన్ గా మరీనా ధీర మహిళా.
అతి చిన్న వయసులో నలుగురు పిల్లలను కానీ, ఉన్నదంతా ఊడ్చి ముగ్గురు కూతుళ్ళ పెళ్లి చేసింది, కొడుకును ప్రయోజకుడిని చేయాలనీ ఆశగా ఎదురు చూస్తుంది. గంగవ్వ సరదా గా మొదలు పెట్టిన యూట్యూబ్ ప్రయాణం  ఇప్పుడు సినిమాల వరకు వెళ్ళే లా చేసింది. కృషి ఉంటె మనుషులు ఋషులు అవుతారు అని చెప్పడానికి గంగవ్వ జీవితం ఒక నిదర్శనం. జగిత్యాల జిల్లాలోని లంబాడిపల్లి గంగవ్వ పుట్టి పెరిగి పెళ్లి చేసుకున్న వూరు 5  ఏళ్ల వయసు లో గంగవ్వకు వివాహం జరిగింది. ఆమె చదివింది కేవలం ఒకటో తరగతి మాత్రమే . కానీ ఆమె చెప్పే మాటలు వింటుటే ఆమె కష్టాల కథల లో పీహెచ్డీ  చేసిందనే చెప్పుకోవాలి. మొదటి సారి 2016 లో యూట్యూబ్ లో అడుగుపెట్టి కేవలం నాలుగేళ్ల లో సెన్సేషనల్ వీడియోస్ లో నటించింది. ఇప్పటికి మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగింది. ఆత్మస్థైర్యం తో మరింత ముందుకు వెళ్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: