వలసకూలీలకు అన్నం పెట్టి ఆదుకున్న ఆ పోలీస్ ఆఫీసర్ ఎవరో తెలిస్తే సెల్యూట్ చేస్తారు.

Mamatha Reddy
2020 ఇదే నెల చివరి వారంలో సృష్ట్టించిన బీభత్సము అంత ఇంత కాదు. ఆబీభత్సం సుమారు తొమ్మిది నెలలపాటు కొనసాగింది. ఈ కరోనా సమయం లో దేశవ్యాప్తంగా అటు వైద్యులు, మరియు పోలీసులు విది నిర్వహణలో తనమునకలై ఉన్నారు. ఆలా విజయనగరం జిల్లా ఎస్పీ రాజకుమారి ఆరోజు తన విధులు నిర్వహించుకొని ఇంటికి వచ్చింది. సరిగా అర్థరాత్రి సమయంలో ఆమె ఫోన్ మోగింది. లిఫ్ట్ చేసి మాట్లాడితే 'అమ్మ ఆకలి' అంటూ ఓ గొంతు ఆమెకు వినపడింది. వెంటనే చెక్ పోస్ట్ అధికారులకు ఫోన్ చేసి కూలీలకు ఆహారం ఇవ్వండి అని చెబితే ఇప్పుడు ఏమి దొరకవు అంటూ వాళ్ళు చెప్పడంతో, ఆమెనే వంట గదిలోకి వెళ్లి స్వయంగా పులిహోర చేసి దానిని తీసుకోని చెక్ పోస్ట్ దగ్గరికి వెళ్ళింది.
ఎస్పీ రావడం చూసిన అక్కడి పోలీసులు ఈ కూలీల గురించి అడగగా వాళ్ళని క్వారంటైన్  సెంటర్ కి తరలించామని చెప్పడంతో. వెంటనే ఎస్పీ రాజకుమారి ఆ సెంటర్ కి వెళ్లి అక్కడ ఉన్న వలస కూలీలకు పులిహోరను పంపిణి చేసింది. ఆలా వారి యొక్క ఆకలిని తీర్చింది ఎస్పీ రాజకుమారి.  అనంతరం మీరు ఎక్కడి నుండి వచ్చారు అని అడగడంతో అందులో ఒకరు తాము మూడురోజుల క్రితం నెల్లూరు నుండి బయలుదేరమని దారి మధ్యలో ఆహారం దొరకలేదని, డబ్బులు కూడా అయిపోయాయని తీరా విజయనగరం చెక్ పోస్ట్ వచ్చాక తినడానికి ఏదైనా దొరుకుతుందేమో అని అనుకున్నాము  ఏమి దొరక్కపోయేసరికి మీకు ఫోన్ చేశామని తెలిపారు.
మీకు నా నెంబర్ ఎవరిచ్చారు అని ఎస్పీ అడగగా, నెల్లూరు లో తెలిసిన వారు ఇచ్చారని, మధ్యలో వచ్చే పోలీస్ స్టేషన్ మరియు కలెక్టర్ ఆఫీస్ నంబర్లు ఇచ్చారని ఏమైనా అవసరం ఉంటె ఈ నంబర్లకు ఫోన్ చేయమని అయన చెప్పారని ఆలా మీకు ఫోన్ చేశామని వాళ్ళు తెలిపారు. మొత్తానికి వారికీ ఆ నంబర్లు  ఈ విధంగా ఉపయోగపడ్డాయి. నిజంగా  అర్ధరాత్రి ఫోన్ చేసి ఆకలి అని అనగానే ఏమి ఆలోచించకుండా స్వయంగా వండి ఆ వలసకూలీల ఆకలి తీర్చిన ఎస్పీ రాజకుమారి కి హ్యాట్సాఫ్ చెప్పవలసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: