అమ్మ: గర్భిణీలు చింతకాయలు తింటే ఏం జరుగుతుందో తెలుసా..!?

N.ANJI
గర్భధారణ సమయంలో మహిళలకు పుల్లటి పదార్దాలు ఎక్కువుగా తినాలనిపిస్తుంది. ఇక చాల మంది గర్భధారణ సయమంలో పుల్లగా ఉండే పండ్లను, ఊరగాయ, తినేందుకు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అయితే అలాంటి పండ్లలో చింతపండు ది కూడా ముఖ్యమైన స్థానమే అని చెప్పాలి. ఇది మనం సహజంగా తినే పండ్లలా కాకపోయినా కడుపుతో ఉన్నవారికి మాత్రం చింతపండు ఎంతో మేలు చేస్తుంది. మరి దాని వల్ల గర్భిణీలు ఎలాంటి లాభాలు పొందుతారో తెలుసుకుందామా.
ఇక చాలా మంది గర్భందాల్చిన కొన్న రోజుల పాటు ఉదయం నిద్ర లేవగానే వికారంగా వాంతులు అయ్యేలా అనిపిస్తుంది. అలాంటి వారు చింతకాయలు లేదా కొద్దిగా చింతపండు తింటే ఫలితం ఉంటుంది. అయితే డైటరీ ఫైబర్ చింతకాయల్లో ఉండడం వలన మలబద్దకం రాకుండా చేస్తుంది. అధిక బరువు పెరగకుండా కాపాడుతుంది.
అయితే చింతకాయల్లో  లేదా చింతపండు లో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు,ఫైబర్, ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీర వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి. చింతకాయల్లో ఉండే విటమిన్ డే బి3 కడుపులోని బిడ్డ చక్కగా ఎదగడానికి బిడ్డ మెదడు, జీర్ణవ్యవస్థ, మ్యూకస్ తదితర అవయవాలు సరిగ్గా పెరిగేలా చేయడానికి ఉపయోగపడుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
ఇక గర్భిణీలలో హైబీపీ సమస్య ఉంటే  చింతకాయలను తీసుకోవడం మంచిది. శిశువు నెలలు నిండకుండా పుట్టే స్థితి రాకుండా ఉండాలంటే చింతకాయలను తినవలిసిందే. చింతపండులో ఉండే విటమిన్ సి ఆరోగ్యకరమైన  న్యూట్రీషియన్ కాబట్టి దీన్ని రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం మంచిది . కానీ మోతాదుకు మించి విటమిన్ సి తీసుకుంటే మాత్రం గర్భిణీ స్త్రీకి ప్రమాదం అనేచెప్పాలి . దీని వలన గర్భస్రావం అయ్యే అవకాశాలు ఉన్నాయి. విటమిన్ సి ఎక్కువగా తీసుకోవడం వల్ల ప్రొజెస్టరాన్ ఉత్పత్తితగ్గిపోయి గర్భస్రావానికి కారణమవుతుంది. కాబట్టి మోతాదు ముంచకుండా చూసుకోవాలని వైద్యులు హెచ్చరికలు జారీ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: