అమ్మ: గర్భంతో ఉన్నప్పుడు మీరు ఏడిస్తే ఏం జరుగుతుందో తెలుసా..!?
ఇక గర్భంతో ఉన్నప్పుడు ఎప్పుడు నవ్వుతూ, సంతోషంగా ఉండాలని వైద్యులు, పెద్దలు చెబుతూనే ఉంటారు. కానీ ఎప్పుడు అందరూ ఒకేలా ఉండలేరు కదా. కొందరు చాలా సంతోషంగా ఉంటే, మరికొందరు విచారంగా ఉంటారు. ప్రెగ్నన్సీ సమయంలో విచారం ఉండటం, మూడీగా ఉండటం సహజమే కానీ ఎప్పుడు ఇలా ఉండకూడదు. ముఖ్యంగా ఏడవటం వలన అది పుట్టబోయే బిడ్డపై ప్రభావాన్ని చూపుతుందని వైద్యులు అంటున్నారు.
అయితే తల్లి కడుపులో శిశువు అప్పుడప్పుడు కాళ్లతో తన్నడం చేస్తుంటారు. ఇలా చేస్తే బిడ్డ ఎంతో ఆరోగ్యంగా ఉన్నాడని అర్థం. అంటే మీరు సరైన ఆహారం తీసుకోవడంతో పాటు సంతోషంగా ఉండటం వలన. అలాగే బయటి శబ్దాలను, మాటలను గ్రహించగలడు. అలాగే ఎమోషన్స్ కూడా కడుపులోని బిడ్డకు తెలుస్తాయి. మీరు సంతోషంగా, నవ్వుతూ ఉంటే బిడ్డ కూడా అలానే ఉంటాడు. మీరు ఏడుస్తూ బాధపడటం చేస్తే కడుపులో శిశువు అలానే ఉంటారు.
గర్భంతో ఉన్నప్పుడు తల్లి ఇష్టంగా తినే ఆహార పదార్థాలను పెద్దయ్యాక పిల్లలు తినడం చేస్తుంటారు. అయితే తల్లికి ఇష్టమైన ఆటలు, గర్భంతో ఉన్నప్పుడు చేసిన ఇష్టమైన పనులు, అభిరుచులు, అలవాట్లు వారి పిల్లలకు వస్తాయని సర్వే ప్రకారం తేలిన విషయం. అలాగే తల్లి ఎప్పుడు విచారం, బాధపడటం వలన పిల్లల పెరిగి పెద్దయ్యాక విచారంగా ఉండటం, ఆక్టివ్ గా లేకపోవడం జరుగుతుంది. అదే ప్రెగ్నన్సీ అప్పుడు నవ్వుతూ, సంతోషంగా ఉంటే పిల్లలు కూడా పెద్దయ్యాక చలాకీగా, ఉత్సాహంగా ఉంటారు.