కమలా హ్యారిస్ డ్రెస్ వెనుక ఇంత కథ ఉందా?

P.Phanindra
అమెరికా ఉపాధ్యక్షురాలిగా కమలా హ్యారిస్ బుధవారం(అమెరికా కాలమానం ప్రకారం) ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఆమె ప్రమాణ స్వీకారం ముందు లేడీ గాగా ఆలపించిన అమెరికా జాతీయ గీతం అందరిని ఆకట్టుకుంది. ఆ గీతం తరువాతే కమలా హ్యారిస్‌తో సుప్రీం కోర్టు జస్టిస్ ప్రమాణ స్వీకారం చేయించారు. కమలా హ్యారిస్ ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది నిమిషాలకే జో  బైడెన్ కూడా అమెరికాకు 46వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు.
ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి మాజీ అధ్యక్షులు బరాక్ ఒబామా, బిల్ క్లింటన్, జార్జ్ బుష్, మాజీ ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. మాజీ అధ్యక్షుడు ట్రంప్ మాత్రం ఈ కార్యక్రమానికి గైర్హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి కొద్ది గంటల ముందే అధ్యక్షుడి హోదాలో ఆయన వాషింగ్టన్ నుంచి ఫ్లోరిడాలోని ఆయన నివాసానికి చేరుకున్నారు. ఇక ఈ విషయం ఇలా ఉంటే.. ప్రమాణ స్వీకారం రోజున కమలా హ్యారిస్ చీర కట్టులో కనపడతారని అంతా అనుకున్నారు. కానీ.. ఆమె మాత్రం పర్పుల్ కలర్(వంకాయ రంగు) దుస్తుల్లో కనిపించారు.
అయితే ఈ రంగు దుస్తులు వేయడం వెనుక పెద్ద కథే ఉంది. కమలా హ్యారిస్ గతంలో అధ్యక్ష పదవికి పోటీ చేసిన విషయం అందరికి తెలిసిందే. ఆ సమయంలో ఎన్నికల ప్రచారం సందర్భంగా కూడా ఆమె పర్పుల్ కలర్ దుస్తులనే ధరించారు. ప్రత్యేకంగా ఈ రంగు దుస్తులను కమలా హ్యారిస్ ధరించడం వెనుక కారణం ఏంటంటే.. దశాబ్దాల క్రితం షిర్లే క్రిషోల్మ్ అనే నల్ల జాతి మహిళ అధ్యక్ష పదవికి పోటీ చేయడం జరిగింది. తన రాజకీయ జీవితానికి షిర్లేనే స్ఫూర్తి అని కమలా హ్యారిస్ మొదటి నుంచి చెబుతున్నారు. షిర్లేకు గుర్తుగా కమలా హ్యారిస్ ఈ పర్పుల్ కలర్ దుస్తులను ధరించినట్టు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: