అమ్మ: గర్భధారణ సమయంలో జరిగే బ్లీడింగ్ గురించి తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే..!?

N.ANJI
మహిళలు గర్భం దాల్చినప్పుడు నుండి బిడ్డకు జన్మనిచ్చే వరకు చాల ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇక గర్భధారణ సమయంలో మహిళలు ఆరోగ్యానికి సంబంధించి ఎన్నో అనుమానాలు ఆమెను వెంటాడుతాయి. గర్భధారణ సమయంలో ఏది సహజంగా జరుగుతుందో దేనికి వెంటనే  వైద్యం అవసరమో గర్భిణీ స్త్రీ ఖచ్చితంగా తెలుసుకుని ఉండాలి. లేదంటే చిన్న చిన్న విషయాలకు కూడా ఆందోళన తో మానసిక ఒత్తిడికి గురవుతారు.
ఇవన్నీ పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంపై ప్రభావం పడడానికి కారణమవుతాయి. ఈ సమయంలో మనసు  చాల ప్రశాంతంగా ఉండాలి. కాబట్టి, గర్భిణీల కు  ఏమైనా  సందేహాలు  ఉంటే గైనకాలజిస్ట్ ని అడిగి తెలుసుకోవాలి. గర్భం దాల్చిన స్త్రీలు  బ్లీడింగ్ మరియు స్పాటింగ్ చూసి ఎక్కువగా భయపడుతుంటారు. భయపడకుండా  అలా జరగడానికి గల కారణాలు తెలుసుకోవాలి. గర్భం దాల్చక ముందు నెలసరి అనేది  జీవితంలో ఒక భాగంగా ముఖ్యమైన స్థానం లో ఉంటుంది. గర్భం దాల్చిన వెంటనే నెలసరి ఆగిపోతుంది.
అయితే గర్భం దాల్చిన తొలి నాళ్లలో స్వల్పంగా బ్లీడింగ్ అవ్వడం అనేది పెద్ద సమస్యేం కాదు. కానీ  బ్లీడింగ్ ఎక్కువగా ఉంటే మాత్రం ముందు జాగ్రత్తగా డాక్టర్‌ను కలవడం మంచిది. గర్భం దాల్చిన 3-4 వారాల్లో లేదా శృంగారం జరిగిన తర్వాత స్రావాలు కనిపించొచ్చు. కొన్నిసార్లు ఏమి లేకుండాకూడా బ్లీడింగ్ కావచ్చు. కొందరు స్త్రీల లో  గర్భం దాల్చాక 6-12 రోజుల తర్వాత  కూడా రక్తస్రావం ఉంటుంది.
ఇక ఫలదీకరణ చెందిన తర్వాత అండం గర్భాశయ గోడలకు అంటిపెట్టుకుని ఉండడం వల్ల బ్లీడింగ్ స్రావాలు కనిపించే అవకాశం ఉంది. కొన్ని సార్లు గర్భస్రావం అయినా కూడా బ్లీడింగ్ కనిపిస్తుంది. గర్భం ధారణ జరిగిన 3 నెలల తర్వాత బ్లీడింగ్ అయితే డాక్టర్‌ని సంప్రదించడం చాల అవసరం అని గుర్తు పెట్టుకోవాలి. గర్భధారణ జరిగినతరువాత ఏదైనా సమస్య వస్తే కంగారు పడకుండా నెమ్మదిగా డాక్టర్ దగ్గరకు వెళ్లి పరీక్ష చేయించుకోవాలి. కంగారు పడడం వలన సమస్య మరింత తీవ్రం అవుతుంది అని గుర్తుపెట్టుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: