అమ్మ: పాలిచ్చే తల్లులూ.. పిల్లల ఎదుగుదలకు ఈ ఆహారం తీసుకోండి..!?

N.ANJI
బిడ్డకు జన్మనిచ్చాక కూడా తల్లి తినే ఆహారాన్ని బట్టి మాత్రమే పసిగుడ్డుకు పోషణ అందుతుంది. కాబట్టి తల్లి ఎంత బలవర్ధకమైన ఆహారం తింటే అంత మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇక తల్లీ, బిడ్డల పోషణ అంటే సరైన పోషకాలుండి తీరాల్సిందే. అయితే బాలింతలు తినే ఆహారంలో తప్పకుండా వెల్లుల్లిని చేర్చాల్సిందే. పప్పు, కూర, చారు, పొడి ఇలా అన్నింటిలోనూ వెల్లుల్లి వేసి వండితే తల్లి-బిడ్డలకు పోషకాలు పుష్కలంగా అందుతాయి, తల్లి పాల ఉత్పత్తి కూడా పెరుగుతుంది. దీంతో బిడ్డకు కడుపునిండా పాలిచ్చే అవకాశం ఉంటుంది. పోత పాలకు దూరంగా ఉండాలంటే వెల్లుల్లిని ఆహారంలో చేర్చండి.
ఇక ప్రసవం తరువాత ఆహారం ఎక్కువ తీసుకోవటాన్ని తల్లి ఎప్పుడూ మరవరాదు. అప్పుడే తల్లి ఒంట్లో పాలు బాగా ఉత్పత్తి అవుతాయి, మీ బిడ్డకు కడుపు నిండుతుంది. నట్స్, విత్తనాలు, అవకాడో వంటి మంచి కొవ్వు ఉండే ఆహారాన్ని క్రమం తప్పకుండా తల్లి తినాలి. తాజా పళ్లు, కూరగాయలు, పొట్టు ధాన్యాలు వంటి మంచి కార్బోహైడ్రేట్స్ ను , ప్రొటీన్స్ ను తల్లికి ఇవ్వాలి. చేపలు, సీ ఫుడ్, చికెన్, గుడ్లు, కందిపప్పు వంటివి తల్లి తినే మెనూలో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. తల్లి తినే ఆహారం ఇద్దరికి సరిపడేంత పోషకాలు అందించాలనే విషయాన్ని మరిస్తే తల్లీ, బిడ్డ ఇద్దరూ నీరసిస్తారు.
అలాగే తల్లికి డీహైడ్రేషన్ కాకుండా ఉండేలా నీళ్లు తాగుతూ ఉండాలి. తల్లి పాలు తక్కువ కాకుండా మీ చిన్నారి కడుపునిండా పాలు తాగాలంటే పాలిచ్చే తల్లులు డీహైడ్రేషన్ బారిన పడకూడదు. పాలిచ్చే తల్లులు రోజూ కనీసం 8 గ్లాసుల నీరు తాగాల్సిందే. పాలు, పాలపదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. ప్రసవానంతరం నెయ్యి, పెరుగు పుష్కలంగా తీసుకోవటం అవసరం. దీంతో తల్లికి, బిడ్డకు క్యాల్షియం హీనత రాకుండా, పాల ఉత్పత్తి పెరుగుతుంది. ఓట్ మీల్ తీసుకోవటంతో తల్లిపాలకు కొరత రాకుండా చూసుకోవచ్చు. డీహైడ్రేషన్ కాకుండా ఉండాలంటే ఏరేటెడ్ డ్రింక్స్ కు దూరంగా ఉండేలా చూసుకోవాలి. పాలిచ్చే తల్లులు ఏరేటెడ్ కూల్ డ్రింక్స్ , ఆల్కహాల్ కు దూరంగా ఉండాల్సిందే. తాజా పళ్లు, కూరగాయల రసం, కొబ్బరి నీళ్లు, నీరు, మజ్జిగ, నిమ్మరసం వంటివి తాగితే మరీ మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: