87గంటల్లో ప్రపంచం చుట్టేసిన యువతి.. శభాష్ అంటున్న ప్రజలు!
3 రోజుల 14 గంటల 46 నిమిషాల 48 సెకన్లలో ఆమె.. మొత్తం 7 ఖండాలను సందర్శించింది. ఆ ఖండాల్లోని 208 దేశాలను సందర్శించిందట. ఈ ఏడాది ఫిబ్రవరి 13న ఆస్ట్రేలియాలోని ప్రముఖ పట్టణం సిడ్నీలో ఆమె ప్రయాణం ముగిసింది. అయితే ఆ సమయంలో కరోనా మహమ్మారి విజృంభిస్తూ ఉండటంతో ఆమెకు రికార్డును అందజేయడం ఆలస్యం అయింది.
యూఏఈలో 200 భిన్న దేశాలకు చెందిన ప్రజలు నివశిస్తున్నారు. ఈ విషయం తెలిసిన తర్వాత వారందరి దేశాలకూ వెళ్లి వారి ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలను తెలుసుకోవాలని ఖావ్లా అనుకుందట. అందుకనే ఈ పర్యటన చేసినట్లు ఆమె తెలిపింది. ఇలా చేయడంతో గిన్నిస్ రికార్డు సాధించడం బోనస్ లాంటిది ఆమె చెప్పింది. మామూలుగా అయితే ఇలా అంతర్జాతీయ ప్రయాణాలు చేయడం అంటే కష్టంతో కూడుకున్న పని. వీసాలను తీసుకోవడం, టిక్కెట్లు బుక్ చేసుకోవడం, విమానాల్లో గంటల తరబడి ప్రయాణించడం.. లాంటి కష్టాలన్నీ ఉంటాయి. కానీ ఖావ్లా ఇంత తక్కువ సమయంలో ఆ సమస్యలు అన్నీ అధిగమిస్తూ ఇలా అన్ని దేశాలను చుట్టి రావడం నిజంగా విశేషమే.
ఈ విషయం తెలిసిన చాలా మంది ఖావ్లాకు శుభాకాంక్షలు చెప్తున్నారు. ఆమె వంటి వారి వల్ల యూఏఈ ఔదార్యం ప్రపంచానికి తెలిసి వస్తుందని మెచ్చుకుంటున్నారు. మనం కూడా ఖావ్లాకు కంగ్రాచ్యులేషన్స్ చెప్పేద్దామా?