మీ వక్షోజాలు అందంగా, బిగుతుగా ఉండాలంటే ఇలా చేయండి.. !!

Suma Kallamadi
ఆడవాళ్ల అందాన్ని వివరించడానికి మాటలు లేవు.  ఆడవారిని చూడగానే వాళ్ళు అందంగా ఉన్నారా ! లేదా  అని చెప్పే విషయాలలో  మొదటిది ముఖం, రెండవది వారి ఎద సంపద. అవును ఏ మగాడైనా ఆడదాని ముఖం తర్వాత చూసేది వక్షోజాలనే. మహిళల్లో అత్యంత సౌందర్యవంతమైన భాగం ఏంటని అంటే వక్షోజాలేనని చెపుతుంటారు. పురుషుడు ఓ స్త్రీ పట్ల ఆకర్షితుడవడం వెనుక ప్రధాన కారణంగా వక్షోజాలను చెపుతుంటారు.  అందువల్లనే మహిళలు తమ స్తన సౌందర్యం పట్ల అత్యంత శ్రద్ధాసక్తులను చూపుతారు. సాదారణంగా చాలా మంది స్త్రీలు వక్షోజాలు సౌష్టవంగా, గుండ్రంగా. నిండుగా లేవని, చిన్నవిగా ఉన్నాయని గిల్టీగా ఫీలవుతారు. వక్షోజ సౌందర్యానికి ఎన్నోరకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు.ఈ క్ర‌మంలో వ‌క్షోజాలు ఎల్ల‌ప్పుడు బిగుతుగా ఉండాల‌న్నా, అందంగా క‌నిపించాల‌న్నా అందుకు కొన్ని సూచ‌న‌లు పాటించాలి. అవేమిటో చూద్దాం. ఒక‌ప్పుడంటే కాదు కానీ  ఇప్పుడు చాలా మంది స్త్రీలు బ్రాల‌ను ధ‌రిస్తున్నారు. అయితే ఎలాంటి బ్రా ధ‌రించినా స‌రైన సైజ్‌ను ఎంపిక‌చేసుకుని ధ‌రించాలి. లేదంటే స్త‌నాలు షేప్ అవుట్ అయిపోతాయి. క‌నుక బ్రా ఎంపిక‌లో స‌రైన సైజ్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి.

కొంద‌రు స్త్రీల‌కు బోర్లా ప‌డుకోవ‌డం అల‌వాటు. అయితే అలా ప‌డుకుంటే వక్షోజాలు ఒత్తిడికి గురై షేప్ అవుట్ అవుతాయ‌ని వైద్యులు చెబుతున్నారు. క‌నుక బోర్లా కాకుండా వేరే దిక్కుగా ప‌డుకోవ‌డం అల‌వాటు చేసుకోవాలి. దీంతో వ‌క్షోజాల‌ను సంర‌క్షించుకోవ‌చ్చు. న‌డిచిన‌ప్పుడు లేదా కూర్చున్న‌ప్పుడు ఛాతీ భాగం నిటారుగా ఉండేలా చూసుకోవాలి. వంగిన‌ట్టు ఆ భాగం పెడితే దాంతో వ‌క్షోజాలు కూడా కింద‌కు వేలాడేందుకు అవ‌కాశం ఉంటుంది. అది దీర్ఘ‌కాలికంగా వాటిని షేప్ అవుట్ అయ్యేలా చేస్తుంది. ఒకేసారి త్వ‌ర‌గా బ‌రువు పెరిగినా లేదంటే త‌గ్గినా అది వ‌క్షోజాల ఆరోగ్యంపై ప్ర‌భావం చూపుతుంది. క‌నుక స‌రైన డైట్ పాటించి క్ర‌మ‌బ‌ద్దంగా బ‌రువు పెర‌గ‌డ‌మో, త‌గ్గ‌డ‌మో చేయాలి.

స్త‌నాల‌ను రోజూ కొంత సేపు వృత్తాకారంలో మ‌సాజ్ చేస్తే కొద్ది రోజుల‌కు అవి చ‌క్క‌ని ఆకారాన్ని పొందుతాయ‌ని ఫిట్‌నెస్ నిపుణులు చెబుతున్నారు.  మ‌ద్యం మానేయాలి. మ‌ద్యం ఎక్కువ‌గా తాగ‌డం వ‌ల్ల స్త్రీ శ‌రీరంలో ఈస్ట్రోజ‌న్ లెవ‌ల్స్ పెరుగుతాయి. అది వ‌క్షోజాల‌పై ప్ర‌భావం చూపుతుంది. క‌నుక ఆల్క‌హాల్‌కు దూరంగా ఉంటేనే మంచిది. తామర పూవులను తీసుకోని మెత్తగా నూరి నిద్రపోయే ముందు స్తనాలకు పుయాలి. స్తనాగ్రలకు మాత్రం రాయకుడదు. ఆ తర్వాత దూది పెట్టుకోని బ్రా వేసుకోని నిద్ర పోవాలి. ఉదయాన్నే లేచి కడిగేసుకుంటే చాలు. అలాగే తామర గింజల పోడి, చక్కెర పోడి సమంగా కలిపి ఒక చెంచా చప్పరించి, ఒక గ్లాసు పాలు తాగుతుండాలి. ఈ రెండిటిని 2, 3 నెలల పాటు క్రమం తప్పకుండా చేస్తే మీ వక్షోజాలు వృద్ధి చెందడం ఖాయం..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: