అమ్మ : గర్భవతిగా ఉన్నప్పుడు ఈ జాగ్రత్తలు పాటించండి.. !!

Suma Kallamadi
ఒక మహిళ జీవితంలో  గర్భవతి  కావడం అనేది మరిచిపోలేని ఒక తియ్యని మధురానుభూతి.తల్లి అవ్వాలని, బిడ్డతో అమ్మ అని పిలిపించుకోవాలని ఎంతగానో ఎదురుచూస్తుంటారు.అలాగే  పుట్ట బోయే బిడ్డ గురించి ఎన్నో కలలు కంటూ ఉంటారు. అలానే బిడ్డ ఆరోగ్యం గురించి ఎన్నో దేవుళ్ళకు మొక్కుతారు.అందుకనే గర్భవతి సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ పని చేయాలన్న, ఏది తినాలన్నా గాని ఒకటికి రెండు సార్లు అలోచించి చేయాలి. ప్రతి క్షణం ఆచితూచి అడుగేయవలిసి  ఉంటుంది. అలాగే ఒక్కోసారి గర్భవతులు ఈ హాస్పిటల్ కు గాని, పని మీద బయటకు గాని వెళ్లవలిసి వస్తుంది. అలాంటప్పుడు  గర్భిణులు కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ,  కొన్ని వస్తువులను కూడా  తప్పనిసరిగా తమతో ఉంచుకోవాలి. ఆరోగ్య విషయంలో కానీ, పరిశుభ్రత  విషయంలో కానీ సమస్యలు రాకుండాచూసుకోవాలి . ముఖ్యంగా ప్రయాణాలు చేసేటప్పుడు మీ బ్యాగ్‌లో వీటిని ఉండేలా చూసుకుంటే మీ ఆరోగ్యం,మీకు పుట్టబోయే బిడ్డ ఆరోగ్యం బాగుంటుంది. ఇప్పుడు ఆ జాగ్రత్తలు ఏంటో తెలుసుకుందాం.. !!!

గర్భిణులు బయటకు వెళ్లవలిసి వచ్చినప్పుడు తప్పనిసరిగా మంచి నీటిని తమ వెంట తీసుకువెళ్లాలి. నీళ్లు బాగా తాగడం వలన తల్లితో పాటు కడుపులోని బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉంటుంది. అందుకనే దాహం వేసినపుడు ఎక్కడ నీళ్లు బడితే అక్కడ నీళ్లు తాగకుండా ముందుగా వాటర్ బాటిల్ ను వెంట ఉంచుకోవాలి. అలాగే గర్భిణీ గా ఉన్నప్పుడు ఆకలి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మంచి నీళ్లతో పాటు బాదంపప్పులు, దానిమ్మ గింజలు, పండ్ల ముక్కలు లాంటి వాటిని వెంటతీసుకువెళ్లేలా చూసుకోవాలి. లేడంటే ఒక బిస్కెట్ ప్యాకెట్ అన్న బ్యాగ్ లో ఉంచుకోవాలి. గర్భవతి గా ఉన్న సమయంలో  చాలామంది మహిళ లు వెన్నునొప్పితో బాధపడుతుంటారు. అందుకే ప్రయాణాలు చేసేటప్పుడు మీ వెంట హీటింగ్‌ ప్యాడ్‌ను తీసుకువెళ్లడం మంచిది .


గర్భిణీ  స్త్రీలు  బయటికి వెళ్లవలిసి వచ్చినప్పుడు  యాంటాసిడ్‌ టాబ్లెట్లను  తప్పనిసరిగా తీసుకెళ్లాలి. బయటకు వెళ్లినప్పుడు ఎక్కువగా  టాయిలెట్‌ సమస్య ఎదురవు తుంటుంది. బయటి వాష్‌రూమ్స్‌ శుభ్రంగా ఉంటాయో లేదో అన్న భయంతో చాలామంది తమ అవసరాలను వాయిదా వేసుకుంటారు . ఇలా చేయడం మంచిది కాదు. అందుకే గర్భిణులు బయటకు వెళ్లినపుడల్లా టాయిలెట్‌ సీట్‌ శానిటైజర్‌ స్ప్రే  ను వెంట తీసుకువెళ్లాలి. ఈ స్ప్రేని ఉపయోగించడం వల్ల తల్లీ బిడ్డలు ఇన్ఫెక్షన్ల బారినా పడకుండా సురక్షితం గా ఉంటారు. అలాగే బ్యాగ్ లో తమకు సంబంధిచిన మెడికల్ ప్రిస్క్రిప్షన్ కూడా వెంట ఉంచుకోవాలి.. అంతేకాకుండా గర్భిణీ స్త్రీ వీలయినంత వరకు ఒంటరిగా ప్రయాణం చేయకుండా ఉంటేనే మంచిది..అలాగే బ్యాగ్ లో తనకి సంబంచిన అడ్రెస్స్ ప్రూఫ్ గాని, ఫోన్ నంబర్స్ బుక్ గాని ఉంచుకుంటే మరి మంచిది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: