అమ్మ : గర్భిణీ స్త్రీ మొదటి నెలలలో ఇలాంటి ఆహారం తింటే కడుపులోని బిడ్డ క్షేమం .. !!

Suma Kallamadi
గర్భవతిగా ఉన్నప్పుడు తల్లి బిడ్డ ఇద్దరి ఆరోగ్యం గురించి ఆలోచించాలి. గర్భవతిగా ఉన్నప్పుడు అదనపు పోషకాలను, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి. అది మీ గురించి కాదు, ఈసారి మీ బిడ్డ గురించి. చాలామంది గర్భిణీ స్త్రీలలో మొదటి నెల గర్భవతిగా ఉన్నప్పుడు ఏమి తినాలో, ఏమి తినకూడదో అన్నా అనుమానంతో ఉంటారు.. అందుకనే  మొదటి నెల గర్భధారణ సమయంలో మీరు మీ ఆహారంలో చేర్చగల వివిధ ఆహార పదార్దాల గురించి తెలుసుకోండి. గర్భవతిగా ఉన్నప్పుడు ఫోలిక్ ఆమ్లం చాలా అవసరం. న్యూరల్ ట్యూబ్ లోపాలను (neural tube defects [NTDs]) నివారించడంలో సహాయపడుతుంది. అలాగే  తీవ్రమైన జనన లోపాలు రాకుండా నివారిస్తుంది. అందువల్ల గర్భిణీ స్త్రీలు ఫోలేట్ అధికంగా ఉండే ఆహారాలు, అలాగే ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్లను తీసుకోవడం చాలా ముఖ్యం. కాయ ధాన్యాలు, గుడ్లు, ఆకుకూరలు, బ్రోకలీ, బీట్రూట్, అరటిపండ్లు వంటి వాటిలో ఫోలేట్ అధికంగా ఉంటుంది.
విటమిన్ బి 6 తీసుకోవడం వలన  చాలా మంది గర్భిణీ స్త్రీలలో వికారం మెరుగుపరచడంలో సహాయపడుతుందని అధ్యయనాలు నిర్ధారించాయి.


హోల్‌గ్రేన్ గోధుమలు, ఇతర తృణధాన్యాలు, విత్తనాలు, నట్స్, అరటిపండ్లు వంటి పండ్లలో, చేపలు,  లీన్ మాంసాలలో విటమిన్ బి6 పుష్కలంగా ఉంటుంది. మొదటి నెలలో తినవలసిన పండ్ల జాబితాలో  కమలాలు, మామిడి పండ్ల ముందు వరుసలో ఉంటాయి.ఎందుకంటే ఈ పండ్లలో విటమిన్ సి, ఫోలిక్ ఆమ్లం విరివిగా  ఉంటాయి.ఆప్రికాట్లు, పియర్ పండు మరియు దానిమ్మ వంటి పండ్లు ఇనుము, కాల్షియం, విటమిన్ కె, పొటాషియం  ఫైబర్లను  పుష్కలంగా అందించగలవు. పండ్లు సాధారణ ఆహారం కంటే కూడా ఎక్కువగా అయోడిన్ యొక్క గొప్ప వనరులు.
ప్రెగ్నెన్సీ సమయంలో పాల ఉత్పత్తులను ఆహారంలో భాగంగా చేర్చాలి. ఎందుకంటే పాలలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది.గర్భిణీ స్త్రీలలో హార్మోన్ల స్థాయిలు పెరగడం వల్ల మలబద్దకం వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల ప్రెగ్నెన్సీ ప్రారంభంలోనే పాలు తాగడం, ఎక్కువ పాల ఉత్పత్తులను తీసుకోవడం మంచిది.


అలాగే ప్రెగ్నెన్సీ మొదటి నెలలో గుడ్లు తినడం కూడా మంచిదే. గుడ్లు  ప్రోటీన్ యొక్క గొప్ప వనరులు. ఇవి మీకు, ప్రారంభ పెరుగుదల సమయంలో మీ బిడ్డకు చాలా అవసరం. గుడ్లలో రోగనిరోధక వ్యవస్థ,  నాడీ వ్యవస్థను నిర్మించడానికి అవసరమైన విటమిన్ డి,  విటమిన్ బి-12 కూడా ఉంటాయి. పచ్చి లేదా ఉడికించని గుడ్లు తినడం కాకుండా, గర్భధారణ సమయంలో ఉడికించిన గుడ్లు తినమని సలహా ఇస్తారు, ఎందుకంటే ఇది గుడ్డులో ఏదైనా హానికరమైన బ్యాక్టీరియా ఉంటే వాటిని తొలగిస్తుంది.గర్భిణీ స్త్రీలు తరచుగా మలబద్ధకం, విరేచనాలు లేదా హేమోరాయిడ్స్‌తో బాధపడవల్సివుంటుంది. ఫైబర్ పరిమాణం అధికంగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: