అమ్మ :బాలింతలు తీసుకోవాలిసిన ఆహారం గురించి తెలుసుకోండి.. !!
అంతేకాకుండా బాలింతలు సీజనల్ గా దొరికే పండ్లు కూడా తింటూ ఉండాలి.పండ్లలో విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. వీటిలో ఉండే విటమిన్ సి సిజేరియన్ అయిన వారికి మంచి చేస్తుంది.అలాగే ఎగ్స్ లో రోజువారీ ప్రొటీన్ అందుతుంది. పైగా ఇందులో విటమిన్ డీ కూడా ఉంటుంది. బిడ్డ కండరాలు, ఎముకలు బలంగా ఉండడానికి ఇది చాలా అవసరం.బాలింతలకి పాలు పడడానికి లిక్విడ్స్ కూడా అవసరం. వీరు డీహైడ్రేట్ అవ్వకుండా ఉండాలంటే కూడా లిక్విడ్స్ కావాలి. అందుకే, నీటితో పాటూ జ్యూసులు, సూప్స్, పాలు, మజ్జిగ వంటివి బాగా హెల్ప్ చేస్తాయి.
బాలింతలు పాలు, పెరుగు, మజ్జిగ కంపల్సరీగా తీసుకోవాలి. విటమిన్స్ ఏ, డీ, కాలిషియం, ఇందులో ఉంటాయి.బాలింతలకి వెల్లుల్లి చాలా మంచిది. ఇందువల్ల పాలు పడతాయి. వెల్లుల్లి ఇమ్యూన్ సిస్టం ని బలోపేతం చేసి ఇన్‌ఫెక్షన్స్ ని దూరంగా ఉంచుతుంది.క్యారెట్స్ లో కార్బోహైడ్రేట్స్, పొటాషియం ఉంటాయి. ఇవి బాలింతలకి కావాల్సిన ఎనర్జీ ని ఇస్తాయి.చికెన్ వంటి లీన్ మీట్ లో వైటల్ న్యూట్రియెంట్స్ ఉంటాయి. ఇవి డీ హెచ్ ఏ నీ, ఫ్యాటీ ఆసిడ్స్ నీ ప్రొవైడ్ చేస్తాయి. బేబీ నెర్వస్ సిస్టం బాగా డెవలప్ అవ్వడానికి సహాయపడతాయి.