పులిపిరులను తగ్గించే సహజ ఇంటి చిట్కాలు మీ కోసం.. !!
తాజాగా ఉండే పైనాపిల్ ముక్కలను పులిపిరికాయల మీద అప్లై చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. రోజులో రెండు మూడు సార్లు అప్లై చేయడం వల్ల త్వరగా ఫలితం ఉంటుంది.వెనిగర్ లో ఉల్లిపాయ ముక్కలు వేసి రాత్రంతా నానబెట్టాలి. తర్వాత రోజు ఉదయం ఈ ఉల్లిపాయ ముక్కలు తీసి పులిపిరికాయల మీద అప్లై చేయాలి. కొద్దిపేపు అలాగే ఉంచితే మంచి ఫలితం ఉంటుంది.పులిపిర్ల నివారణకు అవిసె గింజలు బాగా సహపడుతాయి. అవిసె గింజల పొడిలో కొద్దిగా తేనె మిక్స్ చేయాలి. దీన్ని పులిపిర్ల మీద అప్లై చేయాలి తర్వాత బ్యాండేజ్ చుట్టి సాయంత్రం తీసేయాలి. ఇలా ప్రతి రోజూ రెగ్యులర్ కొన్ని రోజుల పాటు చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
మరో ఎఫెక్టివ్ హోం రెమడీ వెల్లిల్లి రెబ్బలను మెత్తగా పేస్ట్ చేసి పులిపిర్లు ఉన్న ప్రదేశంలో అప్లై చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.కర్పూరం ఆయిల్ చాలా ఎఫెక్టివ్ గా పులిపిరికాయలను నివారిస్తుంది.పులిపిర్లు ఉన్న ప్రదేశంలో కర్పూరం ఆయిల్ ను అప్లై చేయాలి .పులిపిర్లు ఉన్న ప్రదేశంలో ఆముదం నూనెతో మసాజ్ చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఆముదం నూనెను రోజుకు రెండు మూడు సార్లు అప్లై చేయాలి. వాటిని సాప్ట్ గా చేసి, రాలిపోయాలా చేస్తాయి.