అమ్మ : గర్భంరాకుండా ఉండాలంటే ఈ పద్ధతులు పాటించండి.. !!
వీటిలో మీకు ఇష్టమైన, మీకు కంఫర్టబుల్ గా ఉన్న పద్ధతిని ఎంచుకోవచ్చు. ముఖ్యంగా మగవాళ్ళు కండోమ్స్ వాడటం.వీటిని వాడడం వల్ల ప్రెగ్నెన్సీ నుండే కాక సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ నుండి కూడా ప్రొటెక్ట్ చేస్తాయి. ఇంకే ఇతర కాంట్రాసెప్షన్ వాడుతున్నా సరే, కండోమ్ కూడా వాడడం వల్ల మీతో పాటు, మీ పార్ట్నర్ యొక్క సెక్సువల్ హెల్త్ ని కాపాడుకోవచ్చు.కాంట్రాసెప్టివ్ డయాఫ్రమ్ లను పల్చటి, మెత్తటి సిలికాన్ తో తయారు చేస్తారు. ఇది గుండ్రంగా ఉంటుంది. దీన్ని సెక్స్ కి ముందు వజైనా లోకి ఇన్సర్ట్ చేయాలి. ఇది సెర్విక్స్ ని కవర్ చేయడం వల్ల స్పెర్మ్ యుటెరస్ ని చేరలేదు. దీనిని ఇన్సర్ట్ చేసే ముందు స్పెర్మిసైడ్ ని అప్లై చేసి ఇన్సర్ట్ చేయాలి. పీరియడ్స్ టైం లో ఈ డయాఫ్రమ్ ని యూజ్ చేయకూడదు.
ఫీమేల్ కండోమ్ లను పల్చని, మెత్తటి లేటెక్స్ తో తయారు చేస్తారు. వీటిని వజైనా లోపల ఇన్సెర్ట్ చేస్తే సెమెన్ యుటెరస్ ని రీచ్ అవ్వకుండా ఉంటుంది. ఇవి 95% ఎఫెక్టివ్ గా పని చేస్తాయి. ఇవి ప్రెగ్నెన్సీ నుండీ, సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ నుండీ కూడా ప్రొటెక్ట్ చేస్తాయి.ఇంట్రాయుటెరైన్ డివైస్ ఒక చిన్న ప్లాస్టిక్, లేదా కాపర్ తో తయారు చేయబడిన టీ అక్షరం ఆకారం లో ఉండే పరికరం. దీన్నే కాపర్ టీ అని కూడా అంటారు. దీన్ని యుటెరస్ లో ఇన్సర్ట్ చేస్తారు. ఇది ఐదేళ్ళ నుండీ పదేళ్ళ వరకూ పని చేస్తుంది. ఇది 99% ఎఫెక్టివ్ గా పని చేస్తుంది. ప్లాస్టిక్ తో చేసిన ఈ పరికరాన్ని ఇంట్రాయుటెరైన్ సిస్టం అంటారు.