అమ్మ : గర్భిణీ స్త్రీలలో వచ్చే నడుము నొప్పి తగ్గడానికి కొన్ని చిట్కాలు.. !!
పోశ్చర్ తగిన విధంగా ఉంటే బ్యాక్ పెయిన్ ను అరికట్టవచ్చు.అలాగే గర్భిణీ స్త్రీలు వేసుకునే చెప్పుల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు పాటించాలి. హై హీల్స్ వేసుకోవడం అవాయిడ్ చేయాలి . కంఫర్టబుల్ ఫుట్ వేర్ కు ప్రాధాన్యతనివ్వండి. ఈ సమయంలో పాదాలపై ఒత్తిడి పడనటువంటి సౌకర్యవంతమైన ఫుట్ వేర్ నే ఎంచుకోండి. అలాగే చిన్న చిన్న బరువులు ఎత్తేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. చిన్న చిన్న వస్తువులను లిఫ్ట్ చేసేటప్పుడు నెమ్మదిగా ఎత్తండి. అలాగే మెల్లగా లేవండి. ఒక్కసారిగా కిందకు కూర్చుని ఒక్కసారిగా పైకి లేవడం వంటివి చేయకూడదు.సపోర్ట్ ను అందించే మెటర్నిటీ బ్రాను వేసుకోండి. రైట్ సైజ్ నే ధరించండి.
అలాగే బెల్లీను హోల్డ్ చేయడానికి సహకరించే మెటర్నిటీ బెల్ట్ ను ధరించండి . దీంతో, బ్యాక్ పై ఒత్తిడిని తగ్గించవచ్చు.పిల్లోస్ ను వాడి సపోర్ట్ తీసుకోండి. బ్యాక్ పెయిన్ ను తగ్గించడానికి మంచి పరుపుపై నిద్రించండి. కొన్నిసార్లు పరుపు వల్ల కూడా బ్యాక్ పెయిన్ సమస్య ఎదురవవచ్చు.మూడవ త్రైమాసికంలో పక్కకు తిరిగి పడుకోవడం మంచిది. దీని వల్ల బ్యాక్ పెయిన్ తగ్గుతుంది. మంచం మీంచి దిగేటప్పుడు పక్కకు తిరిగి సిట్టింగ్ పొజిషన్ లోకి వచ్చి మెల్లగా దిగాలి.మెడిటేషన్ వల్ల నొప్పిని తట్టుకునే స్థాయి పెరుగుతుంది. పై విధంగా పాటించడంం వల్ల నడుము నొప్పి చాలా వరకు తగ్గుతుంది.