అమ్మ : గర్భవతుల్లో నడుము నొప్పి రావడానికి కారణాలు ఇవే... !!
తమ శరీర బరువుతో పాటూ ఎదుగుతున్న పాపాయి బరువు వల్ల బ్లడ్ వెజిల్స్ పై, పెల్విస్ నరాలపై అలాగే బ్యాక్ పై ఒత్తిడి పెరుగుతుంది.అలాగే గర్భిణీల్లో పోశ్చర్ లో మార్పులు రావడం సహజం. వారు నడిచే తీరుకు అలాగే వారు కదిలే తీరుకు బ్యాక్ పెయిన్ వస్తుంది.రిలాక్సిన్ అనే హార్మోన్ ప్రెగ్నన్సీ సమయంలో విడుదలవుతుంది. ఇది పెల్విక్ ఏరియాలో లిగమెంట్స్, జాయింట్స్ ను మృదువుగా చేస్తుంది.
వెన్నులో లిగమెంట్స్ ను కూడా లూజ్ చేస్తుంది. దాంతో, నొప్పితో పాటు అస్థిరత్వం కూడా వస్తుంది.యుటెరస్ విస్తరిస్తున్న కారణంగా రిబ్ కేజ్ నుంచి పబ్లిక్ బోన్ వరకు ఉండే కండరాలు సెపరేట్ అవుతాయి. ఇవి మరింత నొప్పిని కలిగిస్తాయి.ఒత్తిడి వల్ల కండరాల ఉద్రిక్తత తలెత్తుతుంది. దీంతో బ్యాక్ పెయిన్ వస్తుంది. అధిక బరువు కలిగిన మహిళల్లో లేదా ప్రెగ్నన్సీకి ముందే నడుం నొప్పి కలిగిన మహిళల్లో ప్రెగ్నన్సీ సమయంలో నడుం నొప్పి వచ్చే ప్రమాదం ఉంది. అయితే ఈ నడుము నొప్పి మరి ఎక్కువగా వస్తే మాత్రం వైద్యుడిని సంప్రదించాలి.