అమ్మ : గర్భవతిలో ఈ క్రింది లక్షణాలు ఉంటే జాగ్రత్తలు తప్పనిసరి... !!

Suma Kallamadi
అమ్మ అవ్వాలని, బిడ్డతో అమ్మ అని పిలిపించుకోవాలని ప్రతి మహిళ తాపత్రయపడుతుంది.ఎందుకంటే  ఆడవాళ్లకు ప్రెగ్నెన్సీ రావడం అనేది దేవుడిచ్చిన గొప్పవరం. ప్రెగ్నెన్సీ వస్తే ఆ దంపతులు మాత్రమే కాదు కుటుంబంలో అందరూ సంతోషిస్తారు.కుటుంబంలోకి కొత్తగా ఒక చిన్న బుజ్జాయి రాబోతుందని అందరు సంతోషపడే సమయం అది. ఆ సమయంలో గర్భవతి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఈ చిన్న పొరపాటు జరిగిన మొత్తం కుటుంభం ఆ బిడ్డ మీద పెట్టుకున్న ఆశలు అన్ని అడియాసలు అయిపోతాయి. గర్భవతి అంటే రెండు ప్రాణాలు. అందుకే అనారోగ్యాన్ని సూచించేె ఏలాంటి లక్షణానం అయిన సరే తేలికగా తీసుకోకూడదు. అలాగే ఈ సమయంలో ఇలా జరుగుతుందేమో, అలా జరుగుతుందేమో అనే అపోహలో కూడా ఉండవద్దు.




ప్రమాదాలను సూచించే కొన్ని ప్రమాదకరమైన లక్షణాలు తెలుసుకుని ముందుగానే జాగ్రత్త పడండి.ఆ లక్షణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. !!గర్భవతుల్లో తలనొప్పి, మూర్ఛను సులువుగా తీసుకోవద్దు. తక్కువ  బ్లడ్ ప్రెషర్ వలన ఇలా అవుతుంది. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ ని కలవండి. వాంతులను కూడా ఈజీగా తీసుకొకండి. రోజుకి రెండు సార్లు అంతకన్నా ఎక్కువగా వాంతులు చేసుకుంటే మీ వైద్యులని సలహా అడగాల్సిందే. మూత్రంలో మంటగా అనిపించినా, యోనిలోంచి కొత్తగా స్రావాలు బయటకి వచ్చినా డాక్టర్ దగ్గరకి వెళ్ళాల్సిందే.




అలాగే యోనిలోంచి రక్తం వస్తే  అలసత్వం వద్దు. ఇది ప్రీమెచ్యుర్ బర్త్, మిస్ క్యారేజ్ లేదా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సికి సూచన కావచ్చు. కడుపులో బిడ్డ కదలికలు తగ్గినా డాక్టర్ ని సంప్రదించాల్సిందే. మూత్రం తక్కువగా వస్తూ, దాహం ఎక్కువగా వేస్తే కూడా ఇబ్బందే. అదేపనిగా దాహం వేస్తే డిహైడ్రేషన్ సమస్య ఉన్నట్లు.అలాగే ఎప్పటికప్పుడు బిడ్డ కదలికలు, బిడ్డ గుండె కదలికలు తెలుసుకుంటూ ఉండండి... పైన చెప్పిన ఏ లక్షణాలు అయినా గర్భవతిలో చూసినట్లయితే వెంటనే  వైద్యుడిని సంప్రదించడం మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: