అమ్మ: పిల్లలకు పాలు ఇచ్చే తల్లులు ఆల్కహాల్ తాగవచ్చా... ?

Suma Kallamadi
పిల్లలకు తల్లిపాలు చాలా మంచిది. తల్లిపాలలో బిడ్డకు సరిపడా అన్ని పోషకాలు ఉంటాయి. ఒక విధముగా చెప్పాలంటే తల్లిపాలు బిడ్డకు  అమృతంతో సమానం. కానీ చాలా మంది తల్లులు సరైన అవగాహన లేకపోవడం వల్ల,అలాగే అందం పాడవుతుందనే కారణం చేత తమ పిల్లలకు పాలివ్వడానికి నిరాకరిస్తుంటారు.కానీ బిడ్డ పుట్టిన అప్పటినుండి కనీసం 6 నెలల పాటు బిడ్డకు పాలివ్వడం వల్ల తల్లికి బిడ్డకి ఇద్దరికి మంచిది.అయితే కొంతమంది పాలిచ్చే సమయంలో ఆల్కహాల్ తాగుతుంటారు. కాని అలా పాలు ఇచ్చే సమయంలో ఆల్కహాల్ తాగడం వల్ల చాలా సమస్యలు వస్తాయి. ఆల్కహాల్ తాగే తల్లి తన బిడ్డకు పాలిస్తే తలెత్తే సమస్యలేంటో ఇప్పుడు తెలుసుకోండి.తల్లి ఎంత ఆల్కహాల్ తీసుకుంటే అందులో నుంచి కొంత శాతం ఆల్కహాల్ తల్లిపాలల్లో చేరుతుంది.ఇలా ఈ ఆల్కహాల్ తల్లి పాలలో ఉండడం వల్ల బిడ్డకు అనేక సమస్యలు వస్తాయి. ఆల్కహాల్ ఉన్న తల్లిపాలు పిల్లలు తాగడం వల్ల వారిలో తెలివితేటలు తగ్గుతాయి.

బిడ్డకు మొదటి మూడు నెలలు తల్లిపాలే ఏకైక ఆహారం కావున ఆల్కహాల్ తాగిన పాలను పిల్లలు తాగితే వారి ఆరోగ్యంపై దీర్ఘకాలంలో ప్రభావం పడుతుంది.తల్లి ఏలాంటి ఆహారం తీసుకున్న అది తల్లిపాలల్లోకి చేరుతుంది. తల్లిపాలల్లో అవసరమైన ముఖ్యపోషకాలన్నీ ఎంత కావాలో అంతలో ఉంటాయి. అయితే ఆల్కహాల్ తీసుకోవడం వలన పోషకాల విలువలు తగ్గుతాయి.మెదడులో ఎక్కువ మోతాదులో ఆల్కహాల్ చేరితే  పుట్టిన బేబీకి హాని జరగవచ్చు. అలాగే రానున్న రోజుల్లో వీరికి కాలేయ సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
అంతేకాదు రోజువారీ ఆహారంలో ఆల్కహాల్ ఉండటం వలన ఫోలెట్ తగ్గిపోతుంది.

తల్లిపాలల్లో ఆల్కహాల్ ఉండి అది తాగిన శిశువులు ఎప్పుడూ చిరాగ్గా ఉంటూ, ఎక్కువగా ఏడుస్తూ ఉంటారు. దీనికి గల కారణం ఆ శిశువులు సరిగ్గా నిద్రపోకపోవడమే.నిద్ర పట్టక  అస్తమానం ఏడుస్తూ ఉంటారు.అలాగే పుట్టిన బిడ్డకు అయినా,తల్లికి అయినా రోగనిరోధక శక్తి అనేది చాలా ముఖ్యం. తల్లి ఇచ్చే పాలల్లో రోగనిరోధక శక్తి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది.అటువంటి పాలు ఆల్కహాల్ అనే విషపదార్ధం కలవడం వల్ల విషపూరితం అవుతాయి. అందుకే పాలు ఇచ్చే తల్లులు ఆల్కహాల్ కు దూరంగా ఉంటే ఇద్దరి ఆరోగ్యానికి మంచిది.. !

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: