అమ్మ : సృష్టిలో తియ్యని మాట అమ్మ.. !!

Suma Kallamadi
ప్రేమకు అర్థం తెలియాలంటే చూడాల్సింది నిఘంటువు కాదు, అమ్మ ముఖాన్ని…’ అన్నాడో కవి అది అక్షర సత్యం… అమ్మ అన్న దేవత లేకపోతే… నేను, నువ్వు, మనం… ఈ సమస్త మానవాళి ఉండదు.సముద్రాల్లోని నీరంతా సిరా మార్చి కలాల్లో నింపినా..అమ్మ గురించి వివరించడం సాధ్యం కాదు… ప్రపంచంలోకెల్లా తీయనైన పదం అమ్మ. అమ్మ ప్రేమ కంటే గొప్ప ప్రేమ, అమ్మ కంటే గొప్ప భద్రత ఈ  ప్రపంచంలో మనం ఎక్కడ వెతికిన దొరకదు. అమ్మ మనకు  ప్రత్యక్ష దైవం. అమ్మ ఋణం ఎన్ని జన్మలు ఎత్తినా తీర్చుకోలేనిది.అమ్మ అనే పదం శిశువు ఏడుపు నుండి వచ్చింది.ఒక బిడ్డ ఏడుస్తున్నప్పుడు,ఆ శబ్దం మా.. మా.. అని ధ్వని చేస్తుంది.ఆ శబ్దం నుండి, అమ్మ పదం ఉద్భవించింది.ఇది ద్రవిడ భాషలలో అమ్మ మరియు సంస్కృతంలో అంబా అని మారింది.



ఈ ప్రపంచంలో దేవుళ్ళకి సైతం అమ్మ అంటే ఎంతో ప్రేమ ఉంది. సాక్షాత్తు ఆ కృష్ణభగవానుడే ఇద్దరు అమ్మలా ప్రేమను, ఆప్యాయతను పొందిన అదృష్టవంతుడు. పుట్టిన వెంటనే అమ్మ దేవకీ మాత  ప్రేమకి దూరం అయ్యి.. యశోద మాతకి  దగ్గర అయ్యాడు.. ఇద్దరు అమ్మలా ముద్దుల బిడ్డగా ఎదిగాడు. పెరిగి పెద్ద అయ్యాక కన్న అమ్మ కి దగ్గర అయ్యాక కూడా పెంచిన ప్రేమను మర్చిపోలేదు.. కంటేనే అమ్మ అని అంటే ఎలా.. కనిపించే ప్రతి దేవత కూడా అమ్మే కదా అని మన కన్నయ్య నిరూపించాడు.



కన్న బిడ్డ కాకపోయినా సరే కృషుడ్ని పెంచి పెద్ద చేసింది యశోద మాత. అది అమ్మ ప్రేమ అంటే. అమ్మ ప్రేమని మించిన అనురాగం మరెక్కడా దొరకదు. మాతృత్వపు మమకారం మాటలకు అందనిది. అమ్మతనపు గొప్పదనం అక్షరాలకు అతీతం.. కొడుకు తప్పు చేసిన సరిదిద్దుతుంది. సరైన మార్గంలో నడిపిస్తుంది అమ్మ. అందుకే అమ్మని మించిన దైవం లేదు. కనిపించని ఆ దేవుడి కన్న కని పెంచిన ఆ అమ్మే మనకు దేవత.. అమ్మ గూర్చి ఎంత చెప్పిన ఎంత చేసిన తక్కువే..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: