వర్షాకాలంలో వచ్చే ఆరోగ్య సమస్యలనుండి కుటుంబాన్ని కాపాడుకోవాలంటే ఆడవాళ్ళకి సాధ్యమేనా.. !!
ఆరోగ్యానికి మేలు చేసే ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..కాకరకాయ అంటేనే చాలామంది చేదు అంటూ భయపడతారు. కానీ, ఇందులోని పోషకాలన్నీ ఆరోగ్యానికి చాలా మంచిది. కాకరలో వేడిపుట్టించే గుణాలు ఉంటాయి. అందుకే వర్షాలు పడినప్పుడు తినడం వల్ల శరీరంలో కాస్తా వేడి ఎక్కువ అవుతుంది. వీటిని రెగ్యులర్ గా తినడం వల్ల జీవక్రియ మెరుగుపడి అరుగుదల శక్తి పెరుగుతుంది. సాధారణంగా వర్షాకాలంలో అరుగుదల శక్తి మందగిస్తుంది. అందుకే వీటిని తీసుకోవడం వల్ల ఆ సమస్యలన్నీ పరారైపోతాయి. కాకరలోని ప్రత్యేక గుణాలు జలుబు, దగ్గు, ఆస్తమా వంటి సమస్యలను దూరం చేస్తాయి.అలాగే పసుపులో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఎక్కువగా ఉంటాయి. దీనిని తీసుకోవడం వల్ల ఇన్ఫెక్షన్స్ దూరం అవుతాయి. ఎలాంటి ఆరోగ్య సమస్యలకైనా సరే పసుపు మంచిది అని చెప్పొచ్చు.
రోజూ రాత్రి గోరువెచ్చని పాలల్లో పసుపు కలిపి తాగడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. జలుబు, దగ్గు సమస్యలు దూరం అవుతాయి.వేడి పాలల్లో పసుపు కలుపుకుని తాగితే చాలా మంచిది.వెల్లుల్లికి సహజంగానే వేడి చేసే గుణం ఉంటుంది. అందుకే దీనిని వర్షాకాలంలో ఎక్కువగా తినడం వల్ల చలి నుంచి ఉపశమనం ఉంటుంది.ఈ సీజన్‌లో వెల్లుల్లిని కూడా భాగంం చేసుకోండి.బొప్పాయి పండుకి సాధారణంగానే వేడిచేసే శక్తి ఉంటుంది.ఈ కాలంలో ఈ పండుని తినడం వల్ల శరీరంలో వేడి పెరుగుతుంది. వర్షాల వల్ల వచ్చే ఎన్నో సమస్యలను బొప్పాయి దూరం చేస్తుంది.బొప్పాయి తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు మన దరిచేరవు. ఎక్కువగా నీటిని వేడిచేసి గోరువెచ్చగా తాగాలి. ఇలా చేయడం వల్ల ఎన్నో సమస్యలను దూరం చేయవచ్చు..