ఆడవాళ్ళలో జుట్టు రాలే సమస్యను తగ్గించుకోడానికి కొన్ని చిట్కాలు.. !

Suma Kallamadi

ఆడవాళ్ళలో ఇప్పుడు ఉన్న ప్రధాన సమస్యలలో జుట్టరాలడం.వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిలోనూ జుట్టు రాలే సమస్య అధికం అవుతుంది. మానసిక ఒత్తిడి,అనారోగ్య సమస్యలు, కాలుష్యం… ఇలా కారణాలు ఏమున్నా నేటి తరుణంలో వెంట్రుకలు రాలడం అనే సమస్య చాలా మందిని ఇబ్బందులకు గురి చేస్తోంది. జుట్టు సంరక్షణ కోసం మార్కెట్లో దొరికే వివిధ నూనెలు, షాంపూలు వాడుతూ ఉంటారు. అయితే అవి వాడిన గాని కొంతమందిలో ఫలితం కనపడదు. అందుకనే జుట్టు రాలడాన్ని తగ్గించే కొన్ని చిట్కాల గురించి తెలుసుకోండి.. కలబంద గుజ్జును తలకు రాసుకుని ఒక గంట తర్వాత తలస్నానము చేస్తే జుట్టు రాలే సమస్య తగ్గిపోతుంది. ఇలా చేయ‌డం వ‌ల్ల క‌ల‌బంద‌లో ఉన్న ఔష‌ధ గుణాలు జుట్టుకు చేరి జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది.

 

 

అలాగే  ఉసిరికాయను పేస్ట్ చేసి దానిలో రోజ్ వాటర్ కలిపి తలకు పట్టించి అరగంట తర్వాత తలస్నానము చేయాలి. వీటిలో ఉండే ప్రోటీన్, విటమిన్ సి, ఇత‌ర పోషకాలు జుట్టు రాలడాన్ని తగ్గించి జుట్టు కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది.అలాగే జుట్టుకి మెంతిపిండి కూడా బాగా పని చేస్తుంది.జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. వేప ఆకులో ఎన్నో పోషకవిలువలు ఉన్నాయి.అందుకే  కొన్ని వేప ఆకుల‌ను తీసుకుని ఒక పాత్ర‌లోని నీటిలో వేసి నీరు స‌గం అయ్యే వ‌ర‌కు మ‌రిగించాలి. అనంత‌రం ఆ నీటిని చ‌ల్లార్చి ఆ ద్ర‌వాన్ని జుట్టుకు ప‌ట్టించాలి. కొద్ది సేపు అయ్యాక త‌ల‌స్నానం చేయాలి. వారంలో క‌నీసం ఇలా రెండు సార్లు చేస్తే వెంట్రుక‌లు రాల‌డం అనే స‌మ‌స్య తగ్గుతుంది.

 

 

తలస్నానం చేసేముందు జుట్టుకి పెరుగు పెట్టుకోవడం కూడా చాలా మంచిది.స్నానానికి ముందు ఒక పావుగంట పాటు తలకు పెరుగు రాసుకోవడం వల్ల జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. జుట్టుకు షాంపూ రాయడం కన్నా కుంకుడు కాయలను నలకొట్టి గింజలను తీసేసి వేడి నీటిలో నానబెట్టి ఆ నీటితో తలను రుద్దుకోవాలి.ఈ విధంగా ప్రతి వారం చేస్తూ ఉంటే జుట్టు రాలే సమస్య నుండి బయట పడవచ్చు  అలాగే ఇందులోనే కొన్ని మందారం ఆకులను వేసుకుంటే మరి మంచిది.. అలాగే జుట్టుకి కరివేపాకు చాలా మంచిది.. కూరల్లో కరివేపాకు వస్తే పారవేయకుండా తినడం మంచిది..అలాగే తలకు మందారం నూనె వాడటం వల్ల జుట్టు ఒత్తుగా పెరుగుతుంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: