అమ్మ: కరోనా వైరస్ వచ్చిన స్త్రీ, బిడ్డకు పాలు ఇచ్చే సమయంలో పాటించాల్సిన జాగ్రత్తలు ఇవే...!
ప్రస్తుతం కరోనా వైరస్ పేరు వింటే చాలు ప్రపంచం మొత్తం బయపడిపోతుంది.ఈ వైరస్ ఎప్పుడు ఎవరికి సోకుతుందో తెలియదు.అయితే ముఖ్యంగా వృద్ధులకూ, బలహీనపడిన రోగ నిరోధక వ్యవస్థ కలిగిన వారికీ, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికీ, గర్భిణీలకూ వచ్చే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంది. ముఖ్యంగా గర్భిణీలు ఈ క్రింది జాగ్రత్తలు పాటించడం చాలా అవసరం గర్భిణీలకూ, బాలింతలకూ మామూలు వాళ్లకంటే ఎక్కువగా ఇన్ ఫెక్షన్స్ సోకే ప్రమాదం ఉందన్న సాక్ష్యాలేమీ లేకపోయినా, వాళ్ళ శరీరంలో జరిగే మార్పుల వల్ల వాళ్ళు కొన్ని తీవ్రమైన ఇన్ఫెక్షన్స్ బారినపడే అవకాశముంది ఎక్కువ ఉంది. ఎందుకంటే ఒక స్త్రీ గర్భం ధరించినప్పుడు ఆమె రోగనిరోధకవ్యవస్థ బలహీనపడుతుంది. దానితో ఆమెకి ఇన్ ఫెక్షన్స్ సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
ఈ ఇన్ ఫెక్షన్ల వల్ల తల్లికి మాత్రమే కాదు కడుపులో ఉన్న బిడ్డకీ,ప్రసవించిన తర్వాత బిడ్డకీ కూడా ప్రమాదమే.అయితే చాలా మందిని వెంటాడే ప్రశ్న కారోబార్ సోకిన తల్లి బిడ్డకు పాలు ఇవ్వవచ్చా మీరు బాలింతగా ఉన్నప్పుడు కరోనా సోకితే పుట్టిన బిడ్డకు పాలు ఇవ్వొచ్చా అనే ప్రశ్న చాలా మందిని వేధిస్తుంది. అయితే మన ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం కొవిడ్-19 సోకిన బాలింత తన బిడ్డకూ పాలు నిరభ్యతరంగా ఇవ్వవచ్చు.
తల్లి పాలు శిశువుకు చాలా మేలు చేస్తాయి. ఎందుకంటే తల్లిపాలలో రోగ నిరోధక శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకని కరోనా సోకిన తల్లి తన బిడ్డకు తల్లి పాలు ఇవ్వడం ద్వారా రోగనిరోధక శక్తి బలోపేతం అయ్యి ఎన్నో రకాల వ్యాధుల నుంచి బిడ్డని రక్షిస్తాయి. అయితే బిడ్డని హత్తుకోడానికి, తన బిడ్డతో పాటూ ఒకే గదిలో ఉండడానికి, తన బిడ్డకు తల్లిపాలు పట్టడానికి కావాల్సిన సహాయం తోటి కుటుంబ సభ్యులు అందించాలి.కానీ బిడ్డకు పాలు పెట్టేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. బాలింత బిడ్డను తాకే ముందూ తరువాతా చేతులు శుభ్రంగా కడుక్కోవాలి ఎప్పుడు శానిటైజర్ రాసుకుంటూ ఉండాలి. వీలయితే చేతులకు గ్లోవ్స్ వేసుకోవాలి చుట్టుపక్కల ప్రదేశాలు ఎప్పుడూ శుభ్రంగా ఉంచాలి.
బిడ్డను దగ్గరగా హత్తుకున్నప్పుడూ,పాలు ఇచ్చేటపుడు మాస్క్ వేసుకోవడం తప్పనిసరి. అలాగే పాలు పట్టక ముందు ఒకసారి చను మొనలను శుభ్రమైన నీటితో కడుక్కోవాలి. శిశువు పాలు తాగక కూడా ఒకసారి చను మొనలు మళ్ళీ శుభ్రంగా కడుక్కోవాలి.కరోనా సోకిన బాలింత తనకు సంబంధించిన వస్తువులను వేరేగా పెట్టుకోవాలి. మంచిది పోషక విలువలతో కూడిన ఆహారం తింటూ వైదుడి పర్యవేక్షణలో మందులు వాడుతూ ఉండాలి.