అమ్మ: ప్రసవానంతరం స్త్రీలలో వచ్చే ఆరోగ్య సమస్యలు ఇవే...!

Suma Kallamadi

చాలా మంది మహిళలు గర్భవతిగా ఉన్నపుడు ఆరోగ్యం మీద  తీసుకున్న జాగ్రతలు ప్రసవం అయిన తర్వాత పాటించారు. ప్రసవం అయిపోయాక ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం చేస్తుంటారు. అయితే ఈ నిర్లక్ష్యం పలు సమస్యలకు కారణమవుతుంది. ముందునుంచే ఈ సమస్యల పట్ల తగిన అవగాహన పెంచుకొని, కొద్దిపాటి జాగ్రత్తలు పాటిస్తే ఈ ఇబ్బందులేమీ రాకుండా చూసుకోవచ్చు. ఇప్పుడు ఆ సమస్యలేమిటో, వాటిని ఎలా పరిష్కరించుకోవాలో తెలుసుకుందాం.. 

 

 

బాలింతల్లో కొందరికి యూరినరీ ఇన్‌ఫెక్షన్స్‌ వచ్చే అవకాశం ఉంది. ఇలాంటివారిలో మూత్ర విసర్జన సమయంలో మంట, నొప్పి, మూత్రాశయం వాపునకు గురికావటం, దగ్గినప్పుడు యోనిలో నొప్పి ఉండటం, మూత్రం తక్కువగా రావటం వంటి లక్షణాలు ఉండొచ్చు. ఇలాంటివారు మంచినీరు ఎక్కువగా తాగాలి. మూత్ర విసర్జనను ఆపుకోకూడదు. వైద్యులు సూచించిన యాంటిబయాటిక్స్‌ వాడుతూ విశ్రాంతి తీసుకోవాలి. ప్రసవానంతరం కొందరు బాలింతలు రక్తహీనతకు గురి అవుతారు. అందుకనే ఐరన్, ఫోలిక్ ఆసిడ్ మందులు వాడాలి..రక్తంపడే ఆహార పదార్ధాలు తింటూ ఉండాలి. కాన్పు తర్వాత కొంతమందిలో నీరు తాగకపోవడం, సరిగ్గా ఆహారం తీసుకోకపోవడం వంటి కారణాల చేత మలబద్దకం సమస్య వస్తుంది. అందుకనే తీసుకునే ఆహారంలో పోషక విలువలు ఉండేలా అలాగే పీచు పదార్ధాలు ఎక్కువగా ఉన్న ఆహారం తినాలి. 

 

 

కొంత మంది బాలింతలు శిశువులకు పాలిచ్చేటప్పుడు వక్షోజాల్లో విపరీతమైన నొప్పి, వక్షోజాలు ఎర్రగా అవ్వడం, ముట్టుకుంటే నొప్పి కలగడం,పాలు తక్కువగా పడటం, అసలు పాలు పడకపోవటం, ఒళ్లు నొప్పులు, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తాయి.ఇలాంటి సందర్భాల్లో వైద్యులు సూచించిన మందులు వాడాలి.సిజేరియన్  చేయించు కున్నప్పుడు పొట్ట మీద వేసే కుట్లలో చీము పట్టకుండా జాగ్రత్త పడాలి లేకపొతే  బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ సోకే ప్రమాదం ఉంది. ఈ ఇన్ఫెక్షన్స్‌ని అశ్రద్ధ చేస్తే అవి రక్తం ద్వారా శరీరమంతటా ప్రాకి ప్రాణాపాయానికి దారితీసే ప్రమాదం ఉంది. ఎలాంటి సమస్యలున్నా వైద్యులను సంప్రదించి తగు చికిత్స తీసుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: