అమ్మ : పిల్లలు పుట్టడం ఆలస్యం అవ్వటానికి గల కారణాలు ఇవే.. !!!

Suma Kallamadi

మాతృత్వములోని తియ్యదనాన్ని పొందేందుకు ప్రతి స్త్రీ తపిస్తుంది. అయితే వివాహమై ఏళ్ళు గడుస్తున్నా గర్భం ధరించకపోతే ఆందోళన మొదలవుతుంది. తెలియకుండానే ఒత్తిడికి లోనవుతుంటారు. దీనివల్ల సంతానసాఫల్యం మరింత దూరమయ్యే అవకాశం ఉంటుంది. కానీ అందుకు గలా కారణాలు తెలుసుకోవడం, తగు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా సమస్యకు పరిష్కారం దొరుకుతుంది …స్త్రీలకు సంబంధించిన సమస్యల్లో అత్యధిక శాతంగా  వేధిస్తున్న సమస్య పిల్లలు పుట్టకపోవటం. దీనిని ఇన్ఫెర్టిలిటీ అంటాం.

 

సాధారణంగా పిల్లలు పుట్టక పోవడానికి దంపతులిద్దరి లోనూ ఏదో ఒక శారీరక లోపం ఉందని అర్థం చేసుకోవాలి. అంతేగాని మహిళల్లో  లోపం ఉండడం వల్ల పిల్లలు కలగడం లేదని అపోహ అసత్యం. 
సంతానం కలగకపోవడానికి అనేక కారణాలున్నాయి. వాటిలో కొన్ని కారణాలు స్త్రీలకు సంబంధించినవి ఉంటాయి. కానీ కొన్ని సందర్భాలలో దంపతులిద్దరూ సంపూర్ణ ఆరోగ్యవంతులు అయినప్పటికీ... వారిలో శారీరక లోపాలు ఏమీ లేకపోయినప్పటికీ... సంతానలేమితో బాధపడుతుంటారు. సరైన వయసులో వివాహమై దాంపత్య జీవితం సజావుగా కొనసాగుతూ వివాహమై రెండేళ్లయినా పిల్లలు కలగకపోవడాన్ని ఇన్ఫెర్టిలిటీ అంటారు. 35 సంవత్సరాలు దాటిన తరువాత వివాహం చేసుకున్న స్త్రీలలో ఏడాది దాటినా పిల్లలు పుట్టకపోతే దానిని ఇన్ఫెర్టిలిటీ గా నిర్ధారించాల్సి ఉంటుంది. ఎందుకంటే 35 సంవత్సరాల తరువాత ఫెర్టిలిటీ రేటు తగ్గే అవకాశం ఉంటుంది. సాధారణంగా వివాహమైన తరువాత 50 శాతం దంపతులు మొదటి మూడు నెలలోనే సంతానవంతులు అవుతారు.

 


గర్భాశయ నిర్మాణంలోనూ, ఆకృతిలోనూ పుట్టుకతో వచ్చే వికృతులు అంటే యోనిభాగం నిర్మాణంలో లోపాలు, యోని ద్వారాలు మూసుకుని ఉండటం, కొంతమందిలో యోని పూర్తిగా ఏర్పడకపోవడం, గర్భాశయం చిన్నదిగా ఉండటం, ట్యూబ్స్ మూసుకుని ఉండటం, సంకోచించి ఉండటం, సర్విక్స్ పొడవుగా సాగి ఉండటం, గర్భాశయ ముఖద్వారం చిన్నదిగా ఉండడం, అండం విడుదల జరిగే రోజున యోని స్రావాలు ఎక్కువగా విడుదల కావడం, శరీర ఉష్ణోగ్రతలు కొద్దిగా పెరగడం, స్వల్పంగా పొత్తికడుపులో నొప్పి రావడం వంటి లక్షణాల వల్ల పిల్లలు పుట్టడం ఆలస్యం కావచ్చు. ఇలాంటి లక్షణాలు ఉన్నట్లయితే చాలావరకు వీరిలో అండం సక్రమంగా విడుదల అవడంలేదని  నిర్ధారించవచ్చు. కొందరిలో ఇలాంటి లక్షణాలు లేకుండానే అండం విడుదల జరుగుతుంది.అయితే పిల్లలు పుట్టలేదని ఒత్తిడికి లోనవడం వల్ల మానసిక ప్రశాంతత లోపిస్తుంది.దీనివల్ల మరింత ఆలస్యం అవుతుంది.పిల్లలు పుట్టకపోవడానికి సరయిన కారణం తెలుసుకుని దానికి సంబంధించిన చికిత్స తీసుకుంటే పిల్లలు పుడతారు...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: