అమ్మ : గర్భవతులు నట్స్ తినడం వల్ల ఎన్ని ఉపయోగాలో తెలుసా.. !!

Suma Kallamadi

 

ప్రెగ్నెన్సీ సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఆహారం విషయంలో జాగ్రత్త అవసరం. ఎందుకంటే గర్భధారణ సమయంలో తినే ఆహారాలు తల్లికి మాత్రమే కాదు కడుపు పెరుగుతున్న బిడ్డ మీద కూడా ప్రభావం చూపిస్తుంది. గర్భిణీలు తినే ముఖ్యమైన ఆహారాల్లో నట్స్ ఒకటి. ఇవి గర్భిణీలకు రెట్టింపు ప్రయోజనాలను అందిస్తాయి. ఇవి తల్లి కంటే శిశువుకే ఎక్కువ ప్రయోజనాలను అందిస్తాయని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. గర్బిణీ స్త్రీలు వీటిని తినడం వల్ల కలిగే ప్రయోజనాలను ఇప్పుడు తెలుసుకుందాం..గర్భధారణ సమయంలో గర్భిణీలు సాధారణంగా ఎదుర్కొనే సమస్య మలబద్దకం. ఈ సమస్యను ఎదుర్కోవడానికి నట్స్ గొప్పగా సహాయపడుతాయి. వీటిలో ఉండే ఫైబర్ కంటెంట్ ఈ గుణాన్ని అందిస్తాయి. ఇవి జీర్ణక్రియ సాఫీగా జరగడానికి మరియు ప్రేగు ఆరోగ్యంగా ఉండటానికి గొప్పగా సహాయపడుతాయి.

 

 

 

నట్స్ లో విటమిన్ ఇ ఎక్కువగా ఉంటుంది. ఇది తల్లి, బిడ్డ ఇద్దరి చర్మ సంరక్షణకు చాలా అవసరం అవుతుంది. చర్మం యవ్వనంగా ఎటువంటి ముడతలు లేకుండా చేస్తుంది. ఈ నట్స్ చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి చర్మకణాలు యవ్వనంగా పెరగడానికి, చర్మాన్ని మృదువుగా ఉంచడానికి సహాయపడుతుంది. వేరుశెనగ, వాల్ నట్స్, బాదం, జీడిపప్పులో ఆరోగ్యకరమైన కొవ్వులు, ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి.నట్స్ లో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి.మాంసాహారాలు తినని వారికి ఈ నట్స్ ఒక గొప్ప మార్గం. మాంసాహారాల్లో ఉన్న ప్రోటీన్లన్నీ ఈ నట్స్ ద్వారా పొందవచ్చు. ఇవి శిశువులో కండరాలు ఏర్పడటానికి చాలా అవసరం. గర్బధారణ సమయంలో శిశువు ఆరోగ్యకరమైన బరువు పెరగడానికి ఉత్తమమైన మార్గాల్లో ఇది ఒకటి.

 

 


నట్స్ లో భాస్వరం, పొటాషియం, జింక్, సెలీనియం మరియు రాగి వంటివి అధిక శాతం ఉంటాయి. పిండం సరైన ఎదుగుదలకు ఇవన్నీ చాలా అవసరం. భాస్వరం, క్యాల్షియం మరియు సెలీనియంలు ఎముకల అభివృద్ధికి చాలా మంచిది. అలాగే గుండె ఆరోగ్యంగా ఉండాలంటే పొటాషియం చాలా ముఖ్యం.నట్స్ లో ఐరన్ సమృద్ధిగా ఉంటుంది. ఇది తల్లి, బిడ్డకు చాలా అవసరం. ఇద్దరిలో హీమోగ్లోబిన్ ఉత్పత్తి చేయడానికి సహాయపడుతాయి. గర్భాధారణ సమయంలో రక్తహీనతనను నివారిస్తుంది. ఇది కడుపులో పెరుగుతున్న శిశువుకు రక్తం మరియు ఆక్సిజన్ సరఫరా చేయడం వల్ల మొదడు ఆరోగ్యానికి సహాయపడతాయి.గర్భధారణ సమయంలో డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల శిశువు మెదడు అభివృద్ధి చెందడానికి సహాయపడుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: