ఆడవాళ్ళలో వచ్చే పీరియడ్స్ సక్రమంగా రాకపోవడానికి కారణాలు ఇవే.. !!

Suma Kallamadi

 

ఆరోగ్యపరంగా పురుషుల కంటే స్త్రీలలోనే అధిక సమస్యలు ఉంటాయి. ఈ సమస్యల్లో ముఖ్యంగా పీరియడ్ సమస్య చాలా వేధిస్తోంది. ఈ పీరియడ్స్ అనేవి ఆడవాళ్ళకి  ప్రతి నెలా వచ్చే ప్రక్రియ. అయితే  ఈ పీరియడ్స్ వచ్చిన ప్రతిసారి ఎంత ఇబ్బంది పెట్టినా  గాని సమయానికి రాకపోతే కంగారు పడాలి అంటున్నారు నిపుణులు. కొంత మందిలో పీరియడ్స్ సక్రమంగా ప్రతి నెలా వస్తుంది. కానీ కొంత మంది స్త్రీలలో మాత్రం పీరియడ్స్ లో తేడాలుంటాయి. హార్మోన్లలో హెచ్చు తగ్గుల  కారణంగా నెలసరి సమయానికి రాకపోవడానికి ఒక కారణం అని చెప్పవచ్చు .అలా కాకుంటే జన్యుపరమైన కారణాలు కూడా ఉండే అవకాశం ఉంది.

 

 

 

 

వ్యాధి నిరోధక వ్యవస్థ, శరీర తత్వం, ఆరోగ్య స్థితిగతుల వల్ల, ఆహారం, ఒత్తిడి, వాతావరణం లోపాలతో పాటు మరిన్ని ఇబ్బందుల వల్ల కూడా ఈ సమస్య ఎదురుకావొచ్చు. సాధారణంగా పీరియడ్స్ 28 నుంచి 30 రోజుల్లోపు వచ్చేస్తుంది. కొన్ని సందర్భాల్లో 2, 3 రోజులు అటు ఇటుగా వస్తుంది. దానికి పెద్ద కంగారు పడాల్సిన అవసరం లేదు కానీ… అలా కాకుండా 40 రోజులు దాటినా రాకుండా ఉండటం… లేదంటే మూడు వారాలకన్నా ముందే రావడం జరుగుతుంది. అలాంటి వాళ్లు మాత్రం కచ్చితంగా డాక్టర్లను సంప్రదించాల్సిందేనని నిపుణులు చెబుతున్నారు.అధిక బరువు ఉండటం లేదా బరువు తక్కువగా ఉండటం వల్ల హార్మోనుల సమస్యలు తలెత్తుతాయి.

 

 

 

 

 

దాంతో మీ పీరియడ్స్ లో మార్పులు చోటుచేసుకుంటాయి. కొంత బరువును కోల్పోవడం వల్ల చాలా మంది మహిళలల్లో తిరిగి సాధారణ పీరియడ్స్ రావడం జరుగుతుంది. అలాగే సంతానోత్పత్తిని కూడా పొందగలుగుతారు. ఈ పీరియడ్స్ టైమ్ అనేది సక్రమంగా వస్తేనే  ప్రెగ్నెన్సీ రావడానికి వీలుంటుంది. ఒక్కోసారి మహిళల్లో నెలసరి ఆలస్యంగా రావడానికి  చదువుల ఆందోళన, ఉద్యోగంలో ఒత్తిడి, థైరాయిడ్ లోపాలు, కుటుంబ పరిస్థితులు కూడా కారణం కావొచ్చు. పోషకాహారం తీసుకోకుండా విపరీతంగా డైట్ ఫాలో అయ్యేవారిలో కూడా ఈ సమస్య తలెత్తుంది. పీరియడ్స్ క్రమం తప్పకుండా రావాలి అంటే బరువు మరీ పెరగకుండా..మరీ తగ్గకుండా చూసుకోవాలి. పోషకాహారం తీసుకుంటూ, వ్యాయామం చేయడం వల్ల పీరియడ్స్ సక్రమంగా వస్తాయి...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: