అమ్మ: గర్భిణీలు ఈ జాగ్రత్తలు పాటిస్తే కరోనా వైరస్ సోకదు.. !!

Suma Kallamadi

ప్రపంచం అంతా ఇప్పుడు కరోనా వైరస్ కారణంగా బయపడి పోతున్నారు. తుమ్ములు వచ్చిన, దగ్గు వచ్చిన ఆమ్మో కరోనా వచ్చిందేమో అని హడలిపోతున్నారు. ఇక రోగనిరోధక శక్తి తక్కువగా ఉండే గర్భిణులు, పిల్లలు, వృద్ధుల పరిస్థితి చెప్పక్కర్లేదు. ముఖ్యంగా గర్భిణులు ఈ వైరస్‌ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం.ఇప్పటి వరకు అయితే కొవిడ్‌ వచ్చిన గర్భవతుల్లో సాధారణ వ్యక్తులకు వచ్చిన సమస్యలే వచ్చాయి. గర్భవతుల్లో ఈ జబ్బు వచ్చినప్పుడు గర్భస్రావాలు, నెలలు నిండని కాన్పులు.. వంటివి ఎక్కువగా కనిపించాయి. అలాగే గర్భస్థ శిశువుకు ప్రాణ వాయువు సరఫరా తగ్గడం వల్ల శిశువు గర్భంలోనే మరణించడం లేదా ఫీటల్‌ డిస్టెస్ర్‌కు (అస్వస్థతకు) లోనుకావడం జరగవచ్చు. 

 

 

 

 

గర్భవతులు  వీలైనంత వరకు ఇంట్లో నుంచి బయటికి వెళ్లకూడదు.ఈ వైరస్‌ సోకిన వ్యక్తులకు దూరంగా ఉండాలి.వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే సంబంధిత నిపుణుల్ని సంప్రదించాలి. ఈ వైరస్‌ రోజుల తరబడి శరీరం బయట కూడా జీవించగలదు. ఏది ముట్టుకున్నా చేతులు కడుక్కోవడం తప్పనిసరి. బయటి నుంచి తెచ్చిన వస్తువులు శరీరానికి, ముఖానికి తగలకుండా చూసుకోవాలి.గర్భిణీలు అత్యవసరమైతే తప్ప  ప్రయాణాలు చేయకూడదు.అలాగే  వీలైనంత వరకు ఇంట్లో వండిన ఆహారాన్నే తీసుకోవాలి. బయట ఫుడ్స్ కి వీలయినంత దూరంగా ఉండండి. అలాగే బయట నుంచి ఏమి అయిన తెచ్చిన గాని వెంటనే ఇంట్లోకి తీసుకురాకూడదు.

 

 

 

 

ఒక రోజు బయట ఉంచి తరువాత ఆ వస్తువులను ఉపయోగించాలి. తర్వాత శానిటైజర్ రాసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే వైరస్ ఏ  రూపంలో ఎలా మనల్ని సోకుతుందో తెలియదు కాబట్టి. అలాగే పాల ప్యాకెట్లు కూడా  ఇంట్లోకి తెచ్చేముందు కడిగి లోపల పెట్టండి  ఇంట్లో కూడా  మాస్కు పెట్టుకుంటే మరి మంచిది. అలాగే చల్లని పదార్ధాలు తీసుకోకపోవడం మంచిది. వేడి పాలు, వేడి నీరు, తాగండి. కొంచెం నీటిలో పసుపు వేసుకుని  వేడిచేసి ఆవిరి పట్టడం మంచిది. ఇతరులతో మాట్లాడే అప్పుడు సామాజిక దూరం పాటించాలి. 
ఇప్పటివరకు దీనికి వ్యాక్సిన్‌ అనేది అందుబాటులో లేదు కాబట్టి పైన చెప్పిన అన్ని జాగ్రత్తలు పాటించడం వల్ల తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: