ఆడవాళ్లు ఇలా ఉంటేనే మగవాళ్ళు ఎక్కువ ఇష్టపడతారంట... !!!
ఎదుటవాళ్ళని ఆకర్షించాలనంటే ఆడవారు కొన్ని లక్షణాలు కలిగి ఉండాలి. మగవారు ఆడవాళ్లు ఇలా ఉండాలని, ఆడవాళ్లు మగవారు ఇలానే ఉండాలని కోరుకోవడంలో తప్పులేదు.ఎవరి అభిప్రాయం వారిది. అది వారి వారి ఇష్టంపై ఆధారపడి ఉంటుంది. అయితే మగవారు మాత్రం మహిళలు ఇలా ఉంటే ఎంతో సంతోషిస్తారు. ఇటువంటి మహిళలనే తమ జీవితంలోకి ఇష్టంగా ఆహ్వానిస్తారు.ఎటువంటి ఆడవాళ్ళని మగవాళ్ళు ఇష్టపడతారో మీరే చూడండి.చిన్నా పిల్లలలాగా ప్రవర్తించే ఆడవాళ్లంటే మగవారికి చాలా ఇష్టం. వారితో ఎక్కువ సమయం గడపడానికి కోరుకుంటారు. చిన్న పిల్లలలా వారు చేసే అల్లరి, చిలిపితనం, అమాయకత్వం వారికి ఇష్టం. అలాగే వీరు చేసే చిన్న చిన్న పనులే అవతలివారి ఒత్తిడిని, మానసిక ఆందోళనలను దూరం చేస్తాయని నమ్ముతారు. ఇటువంటి మహిళలు ఇంకా తెలివైనవారైతే మగవారు మరింత ఎక్కువగా ఇష్టం పెంచుకుంటారు.ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఎవరికీ చెప్పుకోలేని కొన్ని సీక్రెట్స్ ఉంటాయి. అటువంటి రహస్యాలు తెలుసుకోవడం అన్నా, ఆ రహస్యాలను ఛేదించడమన్నా మగవారికి చాలా ఇష్టం.
అలా ఎవరికీ చెప్పుకోలేని ఇష్టమైన రహస్యాలను మగవారితో చెప్పుకుంటే వారి తీర్చగలరు మరియు ఎంతో గర్వంగా ఫీలవుతారు కూడా.నిజానికి అబ్బయిలైనా, అమ్మాయిలైనా సరే వారి నిజజీవితంలో ఎలా ఉంటారో అలా ఉంటేనే వారికి చాలా ఇష్టం.చెడగొట్టడం అంటే కొందరి మహిళలకు సరదా.చెప్పుడు మాటలు చెప్పడం, అబద్దాలు ఆడడటం, చెడు తిరుగుళ్ళు తిరగడం చేస్తే నచ్చదు. ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని బాధలు ఉన్నా సరే తమ తెలివితేటలతో, తమ ఆలోచనలతో ధైర్యంగా ముందుకు వెళుతూ తమపై తాము నమ్మకం కోల్పోని మహిళలంటే మగవారికి చాలా గౌరవం మరియు ఇష్టం కూడా. వీరి గొప్పతనాన్ని ఇతరులకు చెబుతారు మరియు పలువురికి ఆదర్శంగా నిలిచేలా చేస్తారు. మగవారి జీవితంలో అమ్మ తర్వాత ప్రధానపాత్ర పోషించేది వారి జీవితంలోకి వచ్చిన ప్రేయసి లేదా భార్య.
అమ్మ నుండి నిస్వార్థమైన ప్రేమను, అనురాగాన్ని ఎలా ఐతే పొందగలిగారో అదే విధంగా తమ జీవితంలోకి రాబోయే మహిళ నుండి కోరుకుంటారు. ఇటువంటి మహిళలంటే మగవారికి ప్రత్యేకమైన గౌరవం మరియు ఇష్టం.నిజమే మగవారు ఆడవాళ్లు అందంగా ఉండటాన్ని ఇష్టపడతారు. అది కూడా వారు ఇష్టపడుతున్న వారిని మాత్రమే అందంగా, తమకు నచ్చిన విధంగా ఉండాలని కోరుకుంటారు. అలాగే అందమైన మనసు కూడా ఉండాలని కోరుకుంటారు. తమ జీవితంలోకి ఒక అందమైన మహిళ రావాలని, ఆమెతో సమయం తెలియనంతగా గడపాలని కోరుకుంటారు. ఇటువంటి మహిళలను ప్రతి మగాడు ఇష్టపడతారు.